వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ ఎన్నికలు: యూపీపై ప్రత్యేక దృష్టి, అమిత్ షా వ్యూహం అదేనా?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పరాజయం పాలైన కమళ దళం కొత్త వ్యూహాలతో ముందుకెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లో ఖాళీ కానున్న 10 రాజ్యసభ స్థానాల్లో తొమ్మిదింటిని కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది.

గతంలో గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్‌ పటేల్‌ ఎన్నికను నిలువరించాలని తీవ్రంగా యత్నించి భంగపడ్డ విషయం తెలిసిందే. ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని యూపీ విషయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ప్రత్యేక దృష్టి సారించారు.

యూపీలోని 10 రాజ్యసభ స్థానాలకు...

యూపీలోని 10 రాజ్యసభ స్థానాలకు...

యూపీలోని 10 రాజ్యసభ స్థానాలకు అభ్యర్ధులను ఎన్నుకోవాల్సి ఉంది. కాగా ఒక్కో అభ్యర్ధి విజయానికి 37 ఎమ్మెల్యేల మద్ధతు కావాల్సి ఉంది. 300 పైగా సీట్లు ఉన్న బీజేపీ మొదట ఎనిమిది అభ్యర్ధులను బరిలో నిలపగా, విపక్షాల అవకాశానికి గండి కొట్టాలని చివరి నిమిషంలో మరో అభ్యర్ధిని కూడా పోటిలో నిలిపింది. 47 సభ్యులున్న ఎస్‌పీ, 19 మంది సభ్యులున్న బీఎస్పీలు చెరో అభ్యర్థిని బరిలో నిలిపాయి.

అమిత్ షా వ్యూహం ఇదేనా?

అమిత్ షా వ్యూహం ఇదేనా?

బీజేపీకి చెందిన ఎనిమిది అభ్యర్థుల విజయం లాంచనమే కాగా, తొమ్మిదో అభ్యర్ధి విజయం కోసం విపక్ష పార్టీ సభ్యులపై బీజేపీ గాలం వేయటం ప్రారంభించింది. ముఖ్యంగా బీఎస్‌పీ అభ్యర్థి విజయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్నదే అమిత్ షా వ్యూహంగా కనిపిస్తోంది. 19 మంది సభ్యులున్న బీఎస్పీకి.. కాంగ్రెస్‌ మద్ధతు ప్రకటించింది. అది పోనూ మరో 11 మంది సభ్యుల మద్దతు కావల్సి ఉండగా.. ఎస్‌పీ, ఆర్‌ఎల్‌డీ పార్టీ సభ్యుల మద్ధతు ఉంటుందని మాయావతి ప్రకటించారు కూడా.

బీఎస్పీ అభ్యర్థి గెలిస్తే....

బీఎస్పీ అభ్యర్థి గెలిస్తే....

బీఎస్పీ అభ్యర్ధి గనక గెలిస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీతో కూటమి ప్రభావం చూపే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందుకే అమిత్‌షా సమాలోచనలు చేస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో అనూహ్యంగా తొమ్మిదో అభ్యర్ధిని బరిలో నిలిపినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

జాగ్రత్త పడుతున్న విపక్షాలు...

జాగ్రత్త పడుతున్న విపక్షాలు...

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యూహం ప్రతిపక్ష పార్టీలకు అర్థమైపోయింది. దీంతో క్రాస్‌ ఓటింగ్‌ జరగకుండా విపక్షాలు జాగ్రత్తపడుతున్నాయి. తమ అభ్యర్థుల విజయానికి బీజేపీ గండికొట్టాలని చూస్తోందంటూ ఎస్‌పీ, బీఎస్పీలు ఇప్పటికే బీజేపీపై బహిరంగంగా ఆరోపణలు గుప్పించాయి.

English summary
After his mission to deny Ahmed Patel re-election to the Rajya Sabha flopped last year, Amit Shah has a new target: Mayawati's Bahujan Samaj Party or BSP. On Friday, Uttar Pradesh will decide 10 of its 31 seats in the Upper House. Till just hours before nominations closed on the 12th, there were 10 candidates for the 10 seats - 8 from the BJP and one each from Mayawati's BSP and Akhilesh Yadavs's Samajwadi Party or SP. To win, a candidate must get the votes of 37 MLAs or state legislators. The BJP has more than 300, so its eight candidates were safe. The SP, with 47, had 10 to spare. Mayawati had 19. The Congress said its seven MLAs would support her candidate. Now she needed 11 more - the SP said it would give her its surplus 10 and Ajit Singh's party loaned her one more. So her candidate would make it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X