గుజరాత్ ఎన్నికల్లో 150కి పైగా స్థానాల్లో గెలుస్తాం: అమిత్ షా
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా స్థానాల్లో గెలుస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. గుజరాత్‌లో మరోసారి అధికారం నిలుపుకుంటామని ఆయన ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా స్థానాల్లో గెలుస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. గుజరాత్‌లో మరోసారి అధికారం నిలుపుకుంటామని ఆయన ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
2019లో జరగబోయే ఎన్నికల్లో 2014 కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామని అమిత్ షా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి అనేది ఒక తమాషా అయితే బిజెపికి అభివృద్ధి అనేది ఒక సిద్ధాంతమన్నారు.

పాటిదార్లను కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మోసం చేసిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ కాంగ్రెస్ వారి పన్నాగాల్లో చిక్కుకోవద్దని తను పాటిదార్లకు ఈ సందర్భంగా సలహా ఇస్తున్నానని షా చెప్పారు.
పద్మావతి సినిమా వివాదంపై స్పందించమని అడిగినప్పుడు.. సృజనాత్మకంగా సినిమాలు తీయడం గొప్పవిషయమే అయినా ప్రజల మనోభావాలకు కూడా విలువ ఇవ్వాలని అమిత్ షా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications