వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరిత్ర తిరగరాస్తాం, మనల్ని ఆపేదెవరు?: అదంతా మట్టిలోకే అంటూ అమిత్ షా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీర్: చరిత్ర తిరగరాయడంలో తమను ఎవరూ అడ్డుకోలేరని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. అస్సాం ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటు చేసిన అహోం జనరల్ వీర్ లచిత్ బర్ఫకన్ 400వ జయంతి వేడుకల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ చరిత్రను తిరగరాయాలని చరిత్రకారులను ఈ సందర్బంగా షా కోరారు.

మనల్ని ఆపేదెవరంటూ అమిత్ షా

మనల్ని ఆపేదెవరంటూ అమిత్ షా

చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా రాయడంలో మనకు అడ్డుపడేదెవరు? అని అమిత్ షా ప్రశ్నించారు. తాను చరిత్ర ప్రధాన సబ్జెక్టుగా చదువుకున్నానన్నారు. భారత దేశ చరిత్ర సరిగా రాయలేదని, కొన్ని సందర్భాల్లో దాన్ని వక్రీకరించి రాశారని చాలా సార్లు విన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న చరిత్ర సరికాదనే విషయాన్ని పక్కన పెట్టి, 150 ఏళ్లు పాలించిన 30 రాజ వంశాలు, స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన 300 మంది యోధులపై పరిశోధన చేయాలని ప్రొఫెసర్లు, విద్యార్థులకు అమిత్ షా సూచించారు.

వీర్ లచిత్ బర్ఫుకాన్‌ పరాక్రమంపై అమిత్ షా

వీర్ లచిత్ బర్ఫుకాన్‌ పరాక్రమంపై అమిత్ షా


వీర్ లచిత్ బర్ఫుకాన్ లేకుంటే ఈశాన్యం భారత్‌లో భాగం అయ్యేది కాదని అన్నారు. ఆయన ఈశాన్య భారతదేశాన్ని మాత్రమే కాకుండా మొత్తం ఆగ్నేయాసియాను మత మూర్ఖుడు ఔరంగజేబు నుంచి రక్షించారని కొనియాడారు. లచిత్ బర్షుకన్ జీవితం, కాలంపై సాహిత్య రచనలను హిందీతోపాటు 10 భారతీయ భాషల్లోకి అనువదించాలని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను అమిత్ షా కోరారు, దీంతో ఆయన నుంచి భవిష్యత్ తరాలు ప్రేరణ పొందుతారన్నారు. భారతదేశ చరిత్రలో దేశంలోని ఏ ప్రాంతంలోనైనా 150 ఏళ్లకుపైగా పరిపాలించిన 30 గొప్ప సామ్రాజ్యాలను, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడేందుకు ధైర్యాన్ని ప్రదర్శించిన 300 యోధులను గుర్తించాలని చరిత్రకారులు, విద్యార్థులను అమిత్ షా కోరారు.

 అసలు చరిత్ర బయటికొస్తే.. వక్రీకరించిన చరిత్ర మట్టిలోకే

అసలు చరిత్ర బయటికొస్తే.. వక్రీకరించిన చరిత్ర మట్టిలోకే

అసలు చరిత్ర బయటికి వస్తే.. వక్రీకరించి రాసిన చరిత్ర ఇక మట్టిలో కలిసిపోతుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ముందుకొచ్చి, చరిత్ర తిరగ రాయాలని తద్వారా భవిష్యత్ తరాల వారికి మనం స్ఫూర్తిగా నిలవాలన్నారు. ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చరిత్రను పునర్ సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు అమిత్ షా. ఈ సందర్భంగా లచిత్ పై చిత్రీకరించిన డాక్యుమెంటరీని అమిత్ షా ప్రారంభించారు.

మోడీ వచ్చాకే ఈశాన్యంలో శాంతి స్థాపన జరిగిందన్న షా

మోడీ వచ్చాకే ఈశాన్యంలో శాంతి స్థాపన జరిగిందన్న షా

లచిత్ ఎంతో ధీరత్వాన్ని ప్రదర్శించి మొఘల్ సామ్రాజ్య వ్యాప్తిని అడ్డుకున్నారని చెప్పారు. సరియాఘాట్‌లో జరిగిన యుద్ధంలో ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడారని తెలిపారు. లచిత్ ధైర్య సాహసాలు, పరాక్రమాలను దేశ ప్రజలంతా తెలుసుకోవాలన్నారు. ప్రధాని మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు, భారత్‌లోని మిగితా ప్రాంతాల మధ్య వ్యత్యాసం పూర్తిగా తగ్గిపోయిందని అమిత్ షా తెలిపారు. ఈశాన్య భారత్ లో శాంతిస్థాపన జరిగిందన్నారు. ఈశాన్యంలో అభివృద్ధి కూడా వేగంగా జరుగుతోందన్నారు.

English summary
Gujarat: Amit Shah says, No one can stop us from rewriting history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X