వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ సెక్యులర్ పార్టీనా...అక్కడ ముస్లింలీగ్,ఇక్కడ హిందూ పార్టీలతో: అమిత్ షా

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ బిల్లు పాస్ సందర్భంగా జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఓ వైపు సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూనే కేరళలో ముస్లిం లీగ్‌లతో జతకట్టిందని.. మహారాష్ట్రలో హిందూ పార్టీ అయిన శివసేనతో జత కట్టిందని అన్నారు. లోక్‌సభలో బిల్లును ఉద్దేశించి ప్రసంగించిన అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగా వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. ఇక బిల్లుపై చర్చ దాదాపు 8 గంటల పాటు జరిగింది.

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు పాస్ అయ్యాక ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మంచి వాతావరణంలో సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లు పాస్ కావడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. చర్చలో పాల్గొన్న ఎంపీలకు పార్టీలకు మద్దతు తెలిపిన వారికి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. భారత దేశంలో ఉన్న మానవత విలువలకు పురాతనమైన విశ్వాసాలకు అనుగుణంగా ఉందని మోడీ ట్వీట్ చేశారు. ఇక బిల్లులోని ప్రతి అంశాన్ని ఎంతో సహనంతో సభకు వివరించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ప్రధాని ప్రశంసించారు.

Amit Shah slams congress over secularism, says it bonded with Shivsena and Muslim league as partners

ఇక పౌరసత్వ సవరణ బిల్లు 2019 ప్రకారం పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌ల నుంచి డిసెంబర్ 31, 2014లోపు భారత్‌కు వచ్చిన ముస్లింయేతర ప్రజలకు భారత పౌరసత్వాన్ని కల్పిస్తుంది. ఇక లోక్‌సభలో బిల్లు పాస్ కావడంతో రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇక బిల్లును పలు విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించారు. మత ప్రాతిపదికన భారత పౌరసత్వం ఇవ్వడమేంటంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగంలోని చాలా ప్రొవిజన్లను బిల్లు ఉల్లంఘించేలా ఉందని మజ్లిస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఇక బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.

English summary
Union Home Minister Amit Shah countered the Congress party’s claim that the Citizenship (Amendment) Bill is communal in nature with the retort that the Congress is such a secular party that it has Muslim League as a coalition partner in Kerala and the Shiv Sena as an ally in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X