2029 లో ఓటమికి సిద్ధంగా ఉండండి: రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ అమిత్ షా

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష ఇండియా కూటమి చేపట్టిన నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలు అక్రమ చొరబాటుదారులకు రక్షణగా నిలుస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. 2029 లోక్ సభ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారీ కాంగ్రెస్ కు ఓటమి తప్పదని.. ఎన్డీయే కూటమి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఫ్యాబ్రికేటెడ్ మీడియా ఈవెంట్స్, నెగిటివ్ పాలిటిక్స్ నే రాహుల్ గాంధీ నమ్ముకున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, బీజేపీ పాపులారిటీని ప్రశ్నించేముందు ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. చొరబాటుదారులను ప్రోత్సహించి వారిని ఓటర్లుగా మార్చి లబ్ది పొందాలను చూస్తున్న రాహుల్ గాంధీ కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు.

" నేను రాహుల్ గాంధీకి ఒక్కటి చెప్పదలచుకున్నా.. ప్రజలు మీ కుట్రలు, కుతంత్రాలను పసిగట్టారు. SIR కు వ్యతిరేకంగా అక్రమ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించాలని చూస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు. అలాగే 2029 లో మరోసారి ఓటమికి సిద్ధంగా ఉండండి. ఎన్డీయే కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించనుంది. అలాగే కాంగ్రెస్ వరుసగా నాలుగో ఓటమి తప్పదు" అని అమిత్ షా స్పష్టం చేశారు. ఇప్పటికే గుజరాత్‌, బెంగాల్‌, తమిళనాడు, యూపీలో కాంగ్రెస్‌ దారుణ పరాజయం పొందిందని.. భవిష్యత్తులోనూ అదే రిపీట్ అవుతుందని తెలిపారు. ప్రజలు ఇంకా ప్రధాని మోదీ, బీజేపీ, ఎన్డీయే కూటమినే విశ్వసిస్తున్నారని కాంగ్రెస్ ఆ విషయాన్ని గ్రహించాలని అన్నారు.

AmitShah on rahul gandhi Be prepared for defeat in 2029 Amit Shah lashes out at Rahul Gandhi2029

అలాగే 14 పార్టీలను కలిపి కూటమి కట్టినంత మాత్రాన రాహుల్ గాంధీ దేశ గొంతుక కాలేరని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఫ్యాబ్రికేటెడ్ మీడియా ఈవెంట్స్ ద్వారా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేరని స్పష్టం చేశారు. రాజకీయ ఈవెంట్స్ ను మానేసి ప్రత్యక్షంగా గ్రామాల్లోని రైతులు, వ్యవసాయ సంఘాలు, కొండ ప్రాంతాల్లోని ప్రజలు, అడవి బిడ్డలతో కనెక్ట్ కావాలని పరోక్షంగా రాహుల్ కు అమిత్ షా చురకలు అంటించారు. నెగిటివ్ పాలిటిక్స్ తో కాంగ్రెస్ కు ఎలాంటి లాభం లేదని పేర్కొన్నారు. అంతేకాక తమ పార్టీ ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగా గెలిచిందని రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. కానీ తమ పార్టీకి దేశంలో ఉన్న పాపులారిటీని గుర్తించాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+