‘నువ్వు శీలవతివేనా? మీ ఆయనపై ఒట్టేసి చెప్పు'.. ట్రోలర్‌కు వేణు స్వామి భార్య స్ట్రాంగ్ కౌంటర్

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల జాతకాలను చెబుతూ ఆయన వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలోనూ వేణు స్వామికి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయన చేసే వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులపై తరచూ ట్రోలింగ్ కూడా జరుగుతుంటుంది. ఇక వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ప్రముఖ వీణా విద్వాంసురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. వీణ వాయించే వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే తాజాగా ఆమెకు ఓ నెటిజన్ పంపిన అసభ్యకరమైన మెసేజ్ తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు.

10 రోజుల్లో రూ. 500 కోట్లా.. ఈ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్ బాసూ..!
10 రోజుల్లో రూ. 500 కోట్లా.. ఈ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్ బాసూ..!

అసభ్యకర మెసేజ్‌తో వేధింపులు
తనకు ఓ వ్యక్తి మెసేజ్ చేశాడని వీణా శ్రీవాణి తెలిపారు. అది ఫేక్ అకౌంట్ అని చెప్పారు. సదరు వ్యక్తి తనను ఉద్దేశించి అత్యంత అసభ్యకర రీతిలో ప్రశ్నించాడని వెల్లడించారు. ఆ మెసేజ్ చూసి తీవ్రంగా ఆగ్రహం వచ్చిందని చెప్పారు. స్క్రీన్‌షాట్ తీసుకోవాలని అనుకున్నప్పటికీ కోపంలో ఆ అకౌంట్‌ను బ్లాక్ చేశానని ఆమె తెలిపారు. అంతేకాదు, ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేసినట్లు కూడా చెప్పారు. మహిళలను కించపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.

Venu Swamy Wife Veena Srivani Strong Reply to Trolls Over Offensive Social Media Comment
Ranabaali Censor Review: విజయ్ దేవరకొండ 'రణబాలి' సెన్సార్ రివ్యూ..
Ranabaali Censor Review: విజయ్ దేవరకొండ 'రణబాలి' సెన్సార్ రివ్యూ..

'నేను శీలవతిని కాదు.. పర్ఫెక్ట్ మహిళను'
తనను 'శీలవతివేనా? అయితే మీ ఆయన మీద ఒట్టేసి చెప్పు' అంటూ సదరు వ్యక్తి ప్రశ్నించాడని వీణా శ్రీవాణి చెప్పారు. దీనిపై ఆమె కూడా అదే స్థాయిలో ఘాటుగా స్పందించారు. 'నేను శీలవతిని కాదు.. నిజంగా శీలవతిని కాదు. ఎందుకంటే నేను ఒక పర్ఫెక్ట్ మహిళను' అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తొమ్మిది నెలలు బిడ్డను మోసి, ప్రసవ సమయంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైన విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆపరేషన్ థియేటర్‌లో వైద్యులు, అనెస్థీషియన్, ఇతర వైద్య సిబ్బంది ఉంటారని చెప్పారు. అలాంటి సమయంలో ప్రాణాలను కాపాడుకోవడం, బిడ్డను సురక్షితంగా కనడం మాత్రమే ముఖ్యమని అన్నారు. దానిని కూడా మహిళ శీలంతో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

చిరంజీవి - మహేష్‌బాబు కాంబినేషన్‌లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ
చిరంజీవి - మహేష్‌బాబు కాంబినేషన్‌లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ

తాను మాత్రమే కాదని, తనలాంటి కోట్లాది మంది మహిళలు ప్రసవ సమయంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారని వీణా శ్రీవాణి అన్నారు. ప్రతి పురుషుడి జీవితంలో తల్లి, సోదరి, భార్య వంటి మహిళలు ఉంటారని గుర్తుచేశారు. మహిళలు పడే ప్రసవ వేదన, వారు ఎదుర్కొనే కష్టాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఎన్నో విజయాలు సాధిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అలాంటి వారిని చూసి స్ఫూర్తి పొందాల్సింది పోయి.. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా కించపరిచేలా కామెంట్లు చేయడం బాధాకరమని అన్నారు. ఇలాంటి ఆలోచనలు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లవని, పైగా వెనక్కి లాగుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ 'రాకా' నుంచి అద్దిరిపోయే అప్డేట్.. ఇదే కానీ నిజమైతే..!
అల్లు అర్జున్ 'రాకా' నుంచి అద్దిరిపోయే అప్డేట్.. ఇదే కానీ నిజమైతే..!

అయితే తన కామెంట్స్ పురుషులందరినీ ఉద్దేశించి కాదని వీణా శ్రీవాణి స్పష్టం చేశారు. మగవారంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. మహిళలను ఉద్దేశించి ఇలాంటి చీప్ మెసేజ్‌లు పెట్టే కొద్దిమందినే తాను ప్రశ్నిస్తున్నానని తెలిపారు. ఇలాంటి వ్యక్తుల ఆలోచనా విధానం మారాలని సూచించారు. ఇక వీణా శ్రీవాణి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. ఆమెకు మద్దతుగా పలువురు కామెంట్లు చేస్తున్నారు. ట్రోలర్‌కు సరైన సమాధానం ఇచ్చారని ప్రశంసిస్తున్నారు. మహిళలను వ్యక్తిగతంగా కించపరిచేలా కామెంట్లు చేసే వారికి ఆమె ఇచ్చిన సమాధానం గట్టిగా ఉందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+