Viral Video: అభిమానికి ముద్దు పెట్టిన హీరోయిన్ స్నేహ
దక్షిణాది నటీమణుల్లో నటి స్నేహ ఒకరు. 2000 సంవత్సరంలో కోలీవుడ్ లో ఆమె తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. ఎంగనే ఓరు నీల పక్షి ఆమె తొలి సినిమాకాగా.. అందులో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తెలుగులో సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు, వెంకీ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాలీవుడ్ లోనూ ప్రతి ఇంటికీ చేరువయ్యారు స్నేహ.
ఇక ఆమె 2012 లో నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు విహాన్ కాగా కుమార్తె ఆద్యంత.. వివాహం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన స్నేహ.. ఇటీవలి కాలంలో సినిమాల్లోని కీలకమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. అయితే తాజాగా స్నేహ వార్తల్లో నిలిచారు.
అక్టోబర్ 12 న స్నేహ తన 45 వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకలో స్నేహ అభిమాని అయిన ఓ సింగర్ ఆమె చిత్రాల్లోని ఓ పాట పాడి తన గాత్రంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే తన టాలెంట్, గాత్రానికి ముగ్ధురాలైన స్నేహ వేదికపై ఆ అభిమాని పక్కనే కూర్చుని పాటను వినసాగారు. అలాగే వేదికపైనే అతనిని అభినందిస్తూ అతని బుగ్గపై ముద్దు పెట్టుకుని తన సంతోషాన్ని, ఆశీస్సులను తెలియజేశారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక హీరోయిన్ స్నేహ అక్టోబర్ 12 45వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె భర్త, నటుడు ప్రసన్న సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలను తెలియజేస్తూ స్పెషల్ ఫోటోలను షేర్ చేశారు. అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫొటోలను షేర్ చేస్తూ ప్రసన్న ఇలా రాశారు. "నేను తీసిన నీ ప్రతి ఫొటోలోనూ నీ పట్ల ప్రేమ, గౌరవం నాకు కనిపిస్తుంటాయి. నువ్వు అలసిపోకుండా పని చేయడం.. నీ కలలను సాకారం చేసుకోవడం.. అలాగే అత్యంత అంకితభావం కలిగిన తల్లిగా వ్యవహరించడం.. అలాగే నాకు మంచి స్నేహితురాలిగా, గొప్ప ప్రయాణ భాగస్వామిగా ఉండేందుకు సమయం కేటాయిస్తావు" అని రాసుకొచ్చారు.












Click it and Unblock the Notifications
