హైదరాబాద్ లో షాకింగ్ ఘటన.. 30వ ఫ్లోర్‌ నుంచి పడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి.. కారణం ఏంటి..?

హైదరాబాద్‌ లోని నానక్‌ రామ్‌ గూడలో తీవ్ర విషాదం జరిగింది. గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌ మెంట్స్‌ లో నివాసం ఉంటున్న ఉప్పల భరత్ (29) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అపార్ట్‌ మెంట్‌ పై నుంచి కిందకు పడి మృతి చెందాడు. తాను ఉంటున్న 30 వ అంతస్తు నుంచి కింద పార్క్ చేసి ఉన్న కార్లపై పడ్డాడు. దాంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని చికిత్స నిమిత్తం స్టార్ ఆసుపత్రికి తరలించారు.

అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువు ఉప్పల కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు భరత్ కిందపడటానికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భరత్ ఈ అపార్ట్‌ మెంట్‌ కు షిఫ్ట్‌ అయిన రెండు రోజులకే ఇలా చనిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతకు భరత్ బెంగళూరులోని ఓ కంపెనీలో పని చేస్తున్నట్లు సమాచారం. భరత్ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక భరత్ మరణంలో ఇతరుల హస్తం ఏమైనా ఉందా..? ఇలా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. అయితే ప్రాథమిక విచారణలో భరత్ సూర్యాపేట జిల్లాకు చెందిన యువకుడిగా గుర్తించారు. మరిన్ని వివరాల కోసం దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.

Software engineer dies after falling from 30th floor Nanakramguda just 2 days after a shift change

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడే సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన సంభవ్ జైన్ అనే యువకుడు పెద్ద భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహించారు. అయితే దర్యాప్తులో సంభవ్ జైన్.. వ్యక్తిగత కారణాలు, సతీమణితో గొడవలు అలగే డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+