చిన్నమ్మకు ఝలక్ ఇచ్చిన పన్నీర్: ఒకే వేదికపై పట్టించుకోకుండా?

అమ్మ జయలలిత దారిలోనే మేము ముందుకు వెలుతామని, ఆమె విజన్ అయిన 2023 నాటికి తమిళనాడును మరింత అభివృద్ది చేస్తామని, అందుకు అమ్మ తరహాలోనే సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని ఆమె విధేయుడైన పన్నీర్ సెల్వం .

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవిలో కుర్చోవాలని కలలు కంటున్న అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఝలక్ ఇచ్చారు. ఈ దెబ్బతో శశికళతో పాటు ఆమె వర్గీయులు షాక్ కు గురైనారు.

నో డౌట్; నేను ఉన్నంతవరకు అది జరగదు: శశికళ

ఇండియా టుడే దక్షిణ సదస్సు 2017లో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆసక్తికరరీతిలో ప్రసంగించారు. పన్నీర్ సెల్వం ప్రసంగం అంతా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సేవలనే కొనియాడారు.

ఇదే సమయంలో చిన్నమ్మకు సీఎం పదవి విషయంలో పన్నీర్ సెల్వం మౌనందాల్చారు. పన్నీర్ సెల్వం ప్రసంగంలో కేవలం మా గౌరవనీయులైన పార్టీ జనరల్ సెక్రటరీ చిన్నమ్మ అని మాత్రమే చెప్పారు.

అన్నాడీఎంకేలో అసమ్మతి చిచ్చు: దొరైస్వామి, మాజీ స్పీకర్ దెబ్బ

Amma’s Vision Tamil Nadu 2023 remains our blueprint: Tamil Nadu CM Panneerselvam.

తరువాత ప్రసంగం మొత్తం జయలలిత గురించి మాట్లాడారు. 1991లో అమ్మ జయలలిత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో తమిళనాడు తలసరి ఆదాయం దేశ సగటు కన్నా తక్కువగా ఉండేదని, కానీ ఇప్పుడు సగటు కన్నా 75 శాతం అధికాంగా ఉందని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్పారు.

అమ్మ దారిలోనే మేము ముందుకు వెలుతామని, ఆమె విజన్ అయిన 2023 నాటికి తమిళనాడును మరింత అభివృద్ది చేస్తామని, అందుకు అమ్మ తరహాలోనే సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని ఆమె విధేయుడైన పన్నీర్ సెల్వం పేర్కొన్నారు.

రాజకీయాల్లో్కి వస్తా: నన్ను ఏశక్తులు ఆపలేవు: జయ మేనకోడలు దీపా

అమ్మ జయలలిత రూపొందించిన సమ్మిళిత వృద్ది నమూనానే మేం కూడా అనుసరిస్తాం, అందరికీ దక్కేలా చేస్తాం అని సీఎం పన్నీర్ సెల్వం చెప్పారు. ఈ ప్రసంగం జరుగుతున్న సమయంలో వేదిక మీద చిన్నమ్మ శశికళ ఉన్నారు.

అయితే పన్నీర్ సెల్వం అదేమీ పట్టించుకోకుండా ప్రసంగం మొత్తం జయలలిత హయాంలో జరిగిన అభివృద్ది గురించే మాట్లాడారు. సీఎం పదవి విషయంలో శశికళ, పన్నీర్ సెల్వం వర్గీయుల్లో పోటీ నెలకొన్నదనే కథనాలు వస్తున్నాయి. పన్నీర్ సెల్వం ప్రసంగంలో ఎక్కడా శశికళ పదవి గురించి ప్రస్థావన తీసుకురాకపోవడంతో ఆమె వర్గీయులు లోలోపల రగిలిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+