అమ్రపాలి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు: కాల్చిపారేసిన సిగరెట్టే కారణమా?

Subscribe to Oneindia Telugu

పాట్నా: అమ్రపాలి ఎక్స్‌ప్రెస్‌ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కటిహార్‌ రైల్వేయార్డులోని గుశల ర్యాక్‌ పాయింట్‌ వద్ద రైలు నిలిపి ఉంచిన సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.

 Amrapali Express' coach gutted in fire at Katihar Junction in Bihar

రైల్వేయార్డులో నిలిపి ఉంచిన అమ్రపాలి ఎక్స్‌ప్రెస్‌లో పలువురు ప్రయాణికులు సేదదీరుతున్నారు. ఈ సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తి కాల్చి పారేసిన సిగరెట్‌ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

మంటల్లో ఒక బోగీ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A major fire broke out in the general coach of Amrapali Express which runs between Bihar’s Katihar Junction and Amritsar Junction.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి