మనసును కదిలించే ఫోటో : శ్రీలంక మృతులకు అమూల్ బేబీ వినూత్న పద్దతిలో నివాళులు

శ్రీలంక నరమేధంలో ఇప్పటికే 359 మంది మృతి చెందారు. ముష్కరుల ఉగ్రవాదానికి అమాయకులు బలయ్యారు. ఈ ఘటనను ప్రపంచదేశాలు మొత్తం ఖండించాయి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపాయి. ఇక ప్రపంచ దేశాల ప్రజలు కూడా ఈ కష్ట సమయంలో శ్రీలంక ప్రజలకు అండగా నిలిచారు. సోషల్ మీడియా ద్వారా అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ అమూల్ కంపెనీ తనదైన శైలిలో శ్రీలంక బాంబు పేలుళ్ల మృతులకు సంతాపం తెలిపింది.

శ్రీలంక మారణహోమంలో అసువులు బాసిన అమాయక ప్రజలకు అమూల్ కంపెనీ వినూత్న పద్దతిలో నివాళులు అర్పించింది. ఓ కార్టూన్ ద్వారా కంపెనీ నివాళులు అర్పించింది. అంతేకాదు ఆ కార్టూన్‌లో ప్రత్యేకత కూడా మనకు కనిపిస్తుంది. అమూల్ బ్రాండ్ పై ఉన్న బేబీ కన్నీళ్లు కారుస్తూ.. ఈ ఘటనను హృదయవిదారకంగా అభివర్ణించింది. అంతేకాదు తెలివిలేని వారు చేసిన పనికి అమాయకులు బలయ్యారు అంటూ చెప్పుకొచ్చింది. అమూల్ బేబీ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫోటో పలువురిని కలచివేసింది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే అమూల్ బేబీ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టడం చాలామంది అమూల్ బ్రాండ్ అభిమానులకు కన్నీళ్లు తెప్పించింది. అమూల్ బేబి కార్చిన కన్నీరు చుక్కను శ్రీలంక మ్యాప్ రూపంలో డిజైన్ చేశారు.

Amul company pays respect to the Srilanka victims with cartoon, photo goes viral

ఇక కన్నీరు పెడుతున్న అమూల్ బేబీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజెన్ల మనస్సులు బాధతో తల్లడిల్లాయి. ఈ విషయం వారు ఫోటోపై చేసిన కామెంట్లను వీక్షిస్తే అర్థం అవుతుంది. శ్రీలంక ఉగ్రదాడులను నెటిజెన్లు ముక్తకంఠంతో ఖండించారు. ఇదొక పిరికపందల చర్య అని కొందరు కామెంట్ చేశారు. అందమైన దేశం ఇల్ల తల్లడిల్లి పోవడం చూస్తే గుండె తరుక్కుపోతోందంటూ కామెంట్ రాశారు. ఈస్టర్ రోజు జరిగిన ఈ ఘటనతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పవిత్రమైన రోజున భక్తులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సమయంలో ముష్కరులు ఈ దాడి చేయడం హేయమైన చర్యగా ప్రపంచదేశాలు అభివర్ణించాయి. అంతేకాదు మనుషులను చంపమని ఏదేవుడు చెప్పాడు అంటూ మరికొందరు ట్వీట్ చేశారు.

మొత్తానికి అమూల్ కంపెనీ ట్వీట్ చేసిన ఈ ఫోటోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమూల్ సంస్థ కష్టకాలాల్లో వెన్నుదన్నుగా నిలుస్తుందని మరోసారి నిరూపించిందంటూ నెటిజెన్లు ట్వీట్ చేశారు. ఇంతటి కళాత్మకమైన హృదయం అమూల్‌కు కాక మరెవరికి ఉంటుందని మరికొందరు ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+