• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దెబ్బకొట్టిన జీఎస్టీ: అమాంతం పెరిగిన పాల ధరలు: నిర్మలమ్మ హామీ ఏమైంది?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిత్యావసర సరుకులు, ఆహార వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం పట్ల జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీల నాయకులు కొద్దిరోజుల కిందటే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలను చేపట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించడానికి, దీనిపై చర్చించడానికి కాంగ్రెస్ సహా ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీల సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ..అది సాధ్యం కాలేదు.

Out of Hydrogen: వృద్ధాప్యంలో పడ్డ సూర్యుడు: అంతర్థానం తప్పదా?Out of Hydrogen: వృద్ధాప్యంలో పడ్డ సూర్యుడు: అంతర్థానం తప్పదా?

నిర్మలమ్మ హామీ ఇచ్చినా..

నిర్మలమ్మ హామీ ఇచ్చినా..

పాలు, మజ్జిగ, పన్నీర్, బియ్యం, గోధుమలు వంటి పలు రకాల నిత్యావసరాలపై జీఎస్టీని అమలు చేయడం వల్ల దుష్పరిణామాలు సంభవిస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. వాటిని కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం ఖాతరు చేయలేదు. తాను అనుకున్నది చేసింది. జీఎస్టీ పెంపు వల్ల గానీ, ఆయా ఆహార వస్తువులను కొత్తగా జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం వల్ల గానీ పేదలపై ఎలాంటి భారం పడదనీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా హామీ ఇచ్చారు.

 పాల రేట్లు జంప్..

పాల రేట్లు జంప్..

వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. జీఎస్టీ దెబ్బకు పాల ధరలు పెరుగుదల బాట పట్టాయి. దేశంలోనే అతిపెద్ద పాల సమాఖ్యగా అమూల్ తన పాల ధరలను పెంచింది. దీనితో పాటు మదర్ డెయిరీ కూడా పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన రేట్లన్నీ బుధవారం నుంచే అమల్లోకి రానున్నాయి. లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర పెంచుతున్నట్లు ఈ రెండూ తెలిపాయి. పాల సేకరణ, ప్యాకింగ్ వ్యయం భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాయి.

అన్ని రకాల వేరియంట్లపైనా..

అన్ని రకాల వేరియంట్లపైనా..

అన్ని రకాల వేరియంట్లకూ పెరిగిన ధరలను వర్తింపజేసింది అమూల్. గోల్డ్, తాజా, శక్తి, టీ-స్పెషల్ వంటి వేరియంట్లు ప్రస్తుతం అమూల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆవు, గేదె పాలను విక్రయిస్తోందా సమాఖ్య. పెంచిన రేట్ల ప్రకారం చూసుకుంటే- బుధవారం నుంచి అమూల్ గోల్డ్ అర లీటర్ పాల ధర 31, తాజా బ్రాండ్ అర లీటర్ 25, శక్తి అర లీటర్ 28 రూపాయలకు లభిస్తాయి. అమూల్ పాల ధరలు పెరగడం ఈ ఏడాది ఇది రెండోసారి. ఇదివరకు మార్చిలో వాటి రేట్లను పెంచింది.

Recommended Video

Curd తినటం కష్టమే... రేటు 50 శాతం పెరిగింది *Finance | Telugu OneIndia
మదర్ డెయిరీ రేట్లివీ..

మదర్ డెయిరీ రేట్లివీ..

మదర్ డెయిరీ కూడా అన్ని వేరియంట్లపైనా రేట్లను పెంచింది. ఫుల్ క్రీమ్ లీటర్ పాలు 61 రూపాయలుగా నిర్ధారించింది. ప్రస్తుతం ఇది 59 రూపాయలకు లభిస్తోంది. టోన్డ్ మిల్క్ లీటర్ ఒక్కింటికి 45 నుంచి 51 రూపాయలకు పెరిగింది. మదర్ డెయిరీ విక్రయించే లీటర్ ఆవు పాల కోసం ఇకపై 53 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది వినియోగదారులకు. జీఎస్టీ పరిధిలోకి వాటిని తీసుకొచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఆయా కంపెనీలన్నీ పాల రేట్లను పెంచడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

English summary
Amul increases the price of milk by Rs 2. The prices will come into effect from March 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X