వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Amul milk: సామాన్యుడికి షాక్ -అమూల్ పాల ధరలు పెంపు -దేశవ్యాప్తంగా జులై 1నుంచే

|
Google Oneindia TeluguNews

కరోనా విలయంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కుంటుపడటం, నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న వేళ సామాన్యుడికి మరో భారీ షాక్‌ తగిలింది. దేశంలో ప్రముఖ పాల ఉత్పత్తి, మార్కెటింగ్‌ సంస్థ అమూల్‌ పాల ధరను పెంచింది.

Recommended Video

AP Amul Pala Velluva Launch పాడి రైతులకు, మహిళలకూ మేలు... రెండో అమూల్ గా ఆంధ్రప్రదేశ్ !

లీటరు పాలపై రూ.2ల చొప్పున పెంచుతున్నట్టు అమూల్ సంస్థ వెల్లడించింది. అమూల్ పేరుమీదున్న అన్ని బ్రాండ్‌లకు ఈ పెంపును వర్తింపజేసింది. దేశ వ్యాప్తంగా జులై 1నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

జగన్ దెబ్బకు కదిలిన మోదీ: వ్యాక్సిన్ల పంపిణీపై కేంద్రం కీలక సవరణలు -ప్రైవేట్ ఆస్పత్రులకు భారీ షాక్జగన్ దెబ్బకు కదిలిన మోదీ: వ్యాక్సిన్ల పంపిణీపై కేంద్రం కీలక సవరణలు -ప్రైవేట్ ఆస్పత్రులకు భారీ షాక్

ఉత్పత్తి వ్యయం పెరగడంతో దాదాపు 19 నెలల తర్వాత ధర పెంచినట్టు అమూల్ సంస్థ పేర్కొంది. అమూల్‌ గోల్డ్‌, తాజా, శక్తి, టి స్పెషల్‌ తదితర బ్రాండ్‌లన్నింటిపైనా పెంచిన ఈ ధరలు గురువారం నుంచి అమలు కానున్నాయని అమూల్‌ బ్రాండ్ ఉత్పత్తుల మార్కెటింగ్‌ సంస్థ (జీసీఎంఎంఎఫ్‌) ఎండీ ఆర్‌ఎస్‌ శోధి తెలిపారు.

బీజేపీ బరితెగింపు: రైతులపై దాడి -ఢిల్లీ సరిహద్దులో టెన్షన్ -తోలు ఒలుస్తామంటూ టికాయత్ వార్నింగ్బీజేపీ బరితెగింపు: రైతులపై దాడి -ఢిల్లీ సరిహద్దులో టెన్షన్ -తోలు ఒలుస్తామంటూ టికాయత్ వార్నింగ్

Amul hikes milk prices by Rs 2 per litre across India from july1, blames high input costs

అమూల్ పాల ధర పెంపునకు ఉత్పత్తి వ్యవయంతోపాటు ఇంధన ధరలు కూడా కారణమని ప్రకటనలో పేర్కొన్నారు. అమూల్ పాల ప్యాకింగ్‌పై అదనపు వ్యయం 30 నుంచి 40శాతం, రవాణాపై 30శాతం, ఇంధన వ్యయం 30 శాతం పెరగడంతో పాల ధరలు పెంచినట్టు సంస్థ పేర్కొంది. ఇదిలా ఉంటే,

దేశంలో పెట్రో ధరల పరుగులు కొనసాగుతున్నాయి. మంగళవారం రోజు లీటర్‌ పెట్రోల్‌ పై 37పైసలు, డీజిల్‌ పై 30 పైసలు చొప్పున పెరగ్గా.. బుధవారం అవే ధరలు కొనసాగాయి. హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ 102 రూపాయల 69 పైసలు, డీజిల్‌ ధర 97 రూపాయల 20 పైసలుగా ఉంది. ఇప్పటికే దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి.

English summary
Different categories of milk sold under the Amul brand will become costlier by Rs 2 per litre from July 1. The Gujarat Cooperative Milk Marketing Federation (GCIMMF), which markets and sells different categories of milk and other products under the Amul brand, said that it has raised milk prices by Rs 2 per litre across India. The dairy cooperative cited higher input costs as the reason behind the milk price hike. It said the hike will be applicable across all cities where Amul sells its fresh milk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X