ప్రతిపక్షంలో మహిళా ఎంఎల్ఏలు జీరో
కేరళ: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు గాను కేవలం 8 మంది మహిళలు ఎంఎల్ఏలుగా గెలుపొందారు. గెలిచిన వారందరూ ఎల్ డీఎఫ్ కు చెందిన వారే. గత ప్రభుత్వంలోని ఊమెన్ చాందీ ఆధ్యర్యంలోని యూడీఎఫ్ కూటమిలో మంత్రిగా పని చేసిన మహిళా మంత్రి ప్రస్తుత ఎన్నికల్లో ఓడిపోయారు.
ఊమెన్ చాందీ అధికారంలో ఉన్న సమయంలో మహిళా మంత్రిగా పని చేసిన ఏకైక మహిళ పీ.కే. విజయలక్ష్మి సైతం ఓడిపోయి ఇంటికే పరిమితం అయ్యారు. యూడీఎఫ్ లో ఓ మహిళా శాసన సభ్యురాలు లేకపోవడంతో కేరళ ప్రతిపక్షంలో మహిళా ఎంఎల్ఏలు జీరో అయ్యారు.

ఈ నెల 16వ తేదిన జరిగిన శాసన సభ ఎన్నికల్లో మొత్తం 109 మంది మహిళలు పోటీ చేశారు. అయితే సీపీఎం నుంచి ఇషా పొట్టి, మెర్కి కుట్టి అమ్మ, వీణా జార్జి, ప్రతిభ హరి. శైలజ గెలుపొందారు. సీపీఐ నుంచి ఆశ, గీతా గోపి, బీజీ మోల్ గెలుపొందారు. గత ఎన్నికల్లో విపక్షం నుంచి ఆరుగురు మహిళా శాసన సభ్యులు, ఒకరు అధికార పార్టీకి చెందిన మహిళా ఎంఎల్ఏ ఉన్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.












Click it and Unblock the Notifications