బెంగళూరులో అసోం వ్యక్తి దారుణ హత్య, కత్తులతో పొడిచి, తల మీద బండరాళ్లు వేసి !
చిన్న విషయంలో గొడవ పడిన వ్యక్తులు అసోం వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలోని బాణసవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బెంగళూరు: చిన్న విషయంలో గొడవ పడిన వ్యక్తులు అసోం వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలోని బాణసవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అసోంకు చెందిన సంజయ్ (35) అనే వ్యక్తిని శుక్రవారం దారుణంగా హత్య చేశారు.
అసోం నుంచి బెంగళూరు చేరుకున్న సంజయ్ హెచ్ఆర్ బీఆర్ లేఔట్ లోని మోమ్మోస్ డిలిశియస్ హోటల్ లో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి హెచ్ఆర్ బీఆర్ లేఔట్ 3వ బ్లాక్ లో సంజయ్ తో కొందరు గొడవ పడ్డారు. తరువాత అర్దరాత్రి మూడు బైక్ ల్లో హోటల్ సమీపంలోకి వచ్చారు.

బైక్ ల్లో వచ్చిన నిందితులు సంజయ్ తో గొడవ పెట్టుకుని కత్తులతో దారుణంగా పొడిచారు. అనంతరం బండరాళ్లు తీసుకుని సంజయ్ తల మీద వేచి దాడి చెయ్యడంతో అతను సంఘటనా స్థలంలోనే మరణించాడు. విషయం తెలుసుకున్న బాణసవాడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంజయ్ హత్యను అసోం విద్యార్థి సంఘం ఖండించింది. హంతకులను వెంటనే అరెస్టు చెయ్యాలని అసోం విద్యార్థి సంఘం, పలువురు నాయకులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications