కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. దేశ రాజధానిలో భూప్రకంపనలు: వరుసగా రెండో రోజు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. దేశ రాజధానిలో వరుసగా రెండో రోజు కూడా స్వల్పంగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు నమోదు అయ్యాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.7గా నమోదైంది. ఈ ప్రకంపనల తీవ్రత చాలా స్వల్పమే అయినప్పటికీ.. వరుసగా రెండోసారి సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీ సహా.. దీనికి ఆనుకుని ఉన్న వజీరాబాద్, ఘజియాబాద్, నొయిడా, ఫరీదాబాద్ వంటి ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత 3.5గా నమోదైంది. మరుసటి రోజు మధ్యాహ్నానికి మరోసారి ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మరోసారి ప్రకంపనలు నమోదు అయ్యాయి. దీన్ని తేలిగ్గా తీసుకోలేమని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (ఎన్‌సీఎస్) అధికారులు తెలిపారు.

సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 26 నిమిషాల సమయంలో ఎన్‌సీఆర్ పరిధిలో భూప్రకంపనలు నమోదు అయ్యాయని, భూ ఉపరితలం నుంచి అయిదు కిలోమీటర్ల లోతున ప్రకంపనలు సంభవించినట్లు సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు వెల్లడించారు. ఈ రెండు సంఘటనల్లోనూ ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు వార్తలు రాలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు సూచించారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications