వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

6.3 తీవ్రతతో భారత్ సహా మూడు దేశాలను వణికించిన జంట భూకంపాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ తెల్లవారు జామున జంట భూకంపాలు సంభవించాయి. భారత్ సహా రెండు దేశాలను వణికించాయి. వాటి తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఈ మూడు దేశాల సరిహద్దుల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంపాల వల్ల కొన్ని చోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అందుతోన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రాణనష్టం చోటు చేసుకున్నట్లు తెలియరావట్లేదు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్పంగా ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ అధికారులు పేర్కొన్నారు.

తొలుత- బంగ్లాదేశ్‌లోని సరిహద్దుల్లోని చిట్టాగాంగ్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. చిట్టాగాంగ్ సిటీ.. భారత్-మయన్మార్ సరిహద్దు రీజియన్ పరిధిలోకి వస్తుంది. బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉంటుంది. ఫలితంగా సునామీ ఆందోళనలు మొదట్లో వెలువడ్డాయి. సునామీ రావడానికి అవకాశం లేదంటూ యూరోపియన్ మిడ్‌టెర్రయిన్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. సునామీ సంభవించే అవకాశం లేదని స్పష్టం చేసింది.

 An earthquake of magnitude 6.3 and 6.1 strikes Bangladeshs Chittagong and Mizoram

ఈ తెల్లవారు జామున సరిగ్గా 5:06 నిమిషాలకు భూకంపం సంభవించిందని యూరోపియన్ మిడ్‌టెర్రయిన్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది. ఈ దీని తీవ్రత 30 సెకెన్ల పాటు కొనసాగినట్లు పేర్కొంది. చిట్టాగాంగ్ నగరానికి తూర్పున 174 కిలోమీటర్ల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నిర్ధారించింది. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలిపింది. దీని తీవ్రత పొరుగునే ఉన్న అస్సాంలోని గౌహతి, మియన్మార్‌లోనూ కనిపించినట్లు యూరోపియన్ మిడ్‌టెర్రయిన్ సెస్మాలజీ సెంటర్ స్పష్టం చేసింది.

6.3 తీవ్రతతో భూకంపం సంభవించడం పట్ల చిట్టాగాంగ్, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రోడ్ల మీదికి పరుగులు తీశారు. ఆ తరువాత కూడా ప్రకంపనలు సంభవించడంతో ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డాడు. ఆరుబయటే గడిపారు. భూకంపం తీవ్రతకు కొన్ని చోట్ల భవనాలకు బీటలు వారినట్లు తెలుస్తోంది. భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటిదాకా వార్తలు అందలేదు. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

ఆ తరువాత 10 నిమిషాలకు మరో భారీ భూకంపం ఈశాన్య రాష్ట్రం మిజోరంలో చోటు చేసుకుంది. తెల్లవారు జామున 5:15 నిమిషాలకు మిజోరంలోని టెంజ్వాల్‌లో ఇది సంభవించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. టెంజ్వాల్ నగరానికి ఆగ్నేయ దిశగా 73 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించింది. ఉపరితలం నుంచి 12 కిలోమీటర్ల లోతున చోటు చేసుకున్న ఫలకాల కదలికల వల్ల భూకంపం వచ్చినట్లు పేర్కొంది.

Recommended Video

Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

English summary
An earthquake of magnitude 6.1 occurred today around 5:15 am at 73km SE of Thenzawl, Mizoram. An earthquake of magnitude 6.3 strikes Chittagong, Bangladesh near Myanmar-India border region. European-Mediterranean Seismological Centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X