ఆ విషయం వైసీీపీ ఎప్పుడో చెప్పింది..వింటేగా !!
Postal ballot 2024: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారం కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చేరింది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తొలుత వాటి ఫలితాలనే ప్రకటించాలంటూ జాతీయ స్థాయి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా డిమాండ్ చేస్తోంది.
దీనిపై తాజాగా ఇండియా బ్లాక్ నేతలు.. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలిశారు. మెమొరాండం అందజేశారు. ఈసీని కలిసిన వారిలో కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ, డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి టీఆర్ బాలు, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా.. తదితరులు ఉన్నారు.

ఈసీని కలిసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా తొలుత పోస్టల్ బ్యాలెట్లను కౌంట్ చేయడం, వాటి ఫలితాలను ప్రకటించడం అత్యంత ముఖ్యమని అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనల్లో సైతం చాలా స్పష్టంగా దీన్ని వివరించారని అన్నారు.
2019 ఎన్నికల సమయంలో ఈ నిబంధనలకు ఎన్నికల కమిషన్ తిలోదకాలు ఇచ్చిందని అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. అప్పటి ఎన్నికల్లో ఈ నిబంధనను రద్దు చేసిందని వివరించారు. దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతో ఉందని, అదే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యాత్రాలను తెరవడానికి ముందే ఏ అభ్యర్థికి పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయనేది నిర్ధారించాల్సిన అవసరం ఉందని, ఒకవేళ పోస్టల్ బ్యాలెట్‌కు ముందు ఈవీఎంల లెక్కింపు పూర్తయితే వాటి ఫలితాలను ముందుగా ప్రకటించాల్సిన అవసరం లేదని అన్నారు.
ఇవే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంపై మొన్నటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన సర్కులర్‌పై న్యాయపోరాటం సైతం చేసిందా పార్టీ.












Click it and Unblock the Notifications