వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయ విద్యార్థికి తూటా - కీవ్​ ఆస్పత్రికి తరలింపు : కొనసాగుతున్న రష్యా దాడులు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కీవ్ నగరం పైన పట్టు కోసం రష్యా సేనలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పలు భవనాలు ధ్వంసం చేసాయి. దాడులను కీవ్ నగరం వణికిపోతోంది. కీవ్​లో జరిగిన ఘర్షణల్లో మరో భారతీయ విద్యార్థికి తూటా తగిలింది. తీవ్ర గాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు.ఈ విషయాన్ని పౌర విమానయాశ శాఖ సహాయ మంత్రి జనరల్​ వీకే సింగ్​.. పోలండ్​లోని విమానాశ్రయంలో మాట్లాడుతూ వెల్లడించారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ ఈ ఘటన పైన స్పందించారు.

ఇండియన్ విద్యార్ధికి గాయాలు

ఇండియన్ విద్యార్ధికి గాయాలు


కీవ్​లో ఓ విద్యార్థికి తూటా తగిలినట్లు తెలిసిందని చెప్పారు. వెంటనే నగరంలోని ఆసుపత్రికి తరలించారని వెల్లడించారు. ఇప్పటికే కీవ్​ను వదలి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని భారత రాయబార కార్యాలయం హెచ్చరించిందని గుర్తు చేసారు. యుద్ధ సమయంలో ఏ ప్రాంతం, ఏ దేశం అనేవి కనిపించవని వీకే సింగ్​ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ గగనతలం మూసివేయటంతో సరిహద్దు దేశాల నుంచి భారతీయ విద్యార్ధులను తరలిస్తున్నారు. ఇందు కోసం స్వయంగా భారతీయుల తరలింపు బాధ్యతలను పర్యవేక్షించేందుకు నలుగురు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలను చేరుకున్నారు.

వేగంగా ఆపరేషన్ గంగా

వేగంగా ఆపరేషన్ గంగా


ఇప్పటి వరకు దాదాపు 17 వేల మంది భారతీయులను స్వదేశానికి తరలించి నట్లుగా విదేశాంగా చెబుతోంది. ఇక, రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్​ను వదిలి భారతీయ పౌరులు..విద్యార్ధులు సరిహద్దు దేశాలకు తరలి వెళ్తున్నారు. మరోవైపు.. రష్యా దాడిలో జపోరిజ్జియా పవర్​ ప్లాంట్​లోని కీలకమైన సామగ్రికి ఎలాంటి హాని జరగలేదని అంతర్జాతీయ అణు శక్తి సంస్థకు తెలిపింది ఉక్రెయిన్​. ప్రమాదాన్ని తగ్గించే పనిలో ప్లాంట్​ అధికారులు నిమగ్నమైనట్లు తెలిపింది.

ఆస్పత్రిలో చికిత్స... మార్గదర్శకాలు

ఆస్పత్రిలో చికిత్స... మార్గదర్శకాలు

కర్ణాటకకు చెందిన విద్యార్ది మరణించిన తరువాత ఇప్పుడు మరో విద్యార్దికి తూటాలు తగలటంతో..ఇంకా స్వదేశానికి చేరోవాల్సిన ఉన్న విద్యార్ధుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. సాధ్యమైనంత త్వరగా ప్రతీ ఒక్కరినీ స్వదేశానికి తరలిస్తామని కేంద్రం హామీ ఇస్తోంది. తాజాగా.. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్న విద్యార్దులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. తరలింపుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకుంటున్నామని ప్రధాని వెల్లడించారు.

English summary
The student was trying to escape Kyiv and was wounded in firing, according to the minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X