Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరులో ఫ్లైఓవర్ మీద బైక్- ఇన్నోవా కారు ఢీ, 40 అడుగుల కిందపడి ఆంధ్రా యువకుడి మృతి!

బెంగళూరు/ నెలమంగల: ఫ్లైఓవర్ మీద వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ముందు వెలుతున్న బైక్ ను ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు బైక్ పడటంతో అందులో ప్రయాణిస్తున్న యువకుడు దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలైనాయి.

బెంగళూరు నగరం శివార్లలోని బెంగళూరు - తుమకూరు జాతీయ రహదారి 4 లోని నెలమంగల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి తమకూరు వైపు వెలుతున్న బైక్ ను ఫ్లైఓవర్ మీద వేగంగా వెళ్లిన ఇన్నోవా కారు ఢీకొనింది. ఈ ప్రమాదంలో బైక్ 40 అడుగుల ఎత్తు నుంచి బైక్ కిందకు పడిపోయింది.

An Innova car collides with a bike and falls off a bike rider From flyover near Bengaluru

ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న సంజయ్ కుమార్ (25) అనే యువకుడి తలకు తీవ్రగాయాలై దుర్మరణం చెందాడు. బైక్ లో వెనుక కుర్చుని ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్రగాయాలైనాయి. ప్లైఓవర్ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాయులు రికార్డు అయ్యాయని పోలీసులు అన్నారు. సంజయ్ కుమార్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి కారణం అయిన కారు డ్రైవర్ ను అరెస్టు చేసి ఇన్నోవా వాహనం స్వాధీనం చేసుకున్నామని నెలమంగల పోలీసులు తెలిపారు. ఫ్లైఓవర్ మీద విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు వాహనాలు నడపం వలనే నిత్యం ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని స్థానికులు ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+