వైష్ణోదేవి ఆలయానికి సైకిల్ పై ప్రయాణం ... 2200కిమీ సైకిల్ తొక్కుతూ ఒక వృద్ధురాలి సాహసం
ఎల్లలు లేని భక్తి భావానికి 68 ఏళ్ల మహిళ సాగిస్తున్న ప్రయాణమే ఒక ఉదాహరణ. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న 68 ఏళ్ల వృద్ధురాలు వైష్ణోదేవి ఆలయానికి అత్యంత సాహసోపేతమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. గతంలో కాశీకి, రామేశ్వరానికి వెళ్లడం కోసం రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో కాలినడకన వెళ్లిన ఉదంతాలు విన్నాం. ప్రస్తుతం సైకిల్ పై వైష్ణోదేవి ఆలయానికి 68 ఏళ్ల మహిళ ఒంటరిగా రెండువేల రెండు వందల కిలోమీటర్ల మేర ప్రయాణం సాగించిన ఆసక్తికర కథనాన్ని తెలుసుకుంటున్నాం.

మహారాష్ట్ర నుండి సైకిల్ పై వైష్ణో దేవి ఆలయానికి బయలుదేరిన 68 ఏళ్ల వృద్ధురాలు
మహారాష్ట్రలోని బుల్దనా జిల్లా ఖామ్‌గావ్ కు చెందిన 68 ఏళ్ల వృద్ధురాలు రేఖ దేవ్బంకర్ వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. వైష్ణో దేవిని దర్శిస్తానని మొక్కుకున్న రేఖా దేవ్బంకర్ అనుకున్నదే తడవుగా సైకిల్ మీద తన ప్రయాణాన్ని ప్రారంభించింది. హిమాలయాల్లో కొలువైన వైష్ణోదేవిని దర్శించాలన్న ఆమె సంకల్పం ముందు ఆమె వయసు చిన్నబోయింది. ప్రతిరోజు 40 నుండి 50 కిలోమీటర్ల దాకా ప్రయాణం సాగిస్తోంది. సైకిల్ తొక్కుతూ ఆమె తన గమ్యాన్ని చేరుకోవటానికి ఉత్సాహంగా వెళ్తోంది .

సైకిల్ పై వృద్ధురాలి సాహసయాత్ర ... సోషల్ మీడియాలో వైరల్
అలసట వచ్చినప్పుడు స్థానికంగా ఉండే దేవాలయాలలో సేదతీరుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్ బోర్డర్ వరకు చేరుకుంది . ఆమె వెళుతున్న క్రమంలో ఆమె గురించి తెలుసుకున్న వారు ఆమె సైకిల్ తొక్కుతూ వైష్ణో దేవికి వెళ్లడానికి సాగిస్తున్న ప్రయాణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అది వైరల్ గా మారింది. 68 ఏళ్ల మహిళ ఒంటరిగా సైకిల్ పై రెండువేల రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అని, వైష్ణో దేవిని దర్శించుకోవడం కోసం ఆమె ఈ సాహసోపేతమైన ప్రయాణాన్ని సాగిస్తోందని తెలుసుకున్న నెటిజన్లు అవాక్కయ్యారు.

భక్తి ఎంతటి పనైనా చేయిస్తుందని పలువురి ప్రశంస
సోషల్ మీడియాలో పలువురు ఆమె సాహసాన్ని కొనియాడుతున్నారు. భక్తి ఎంతటి పనినైనా చేయిస్తుంది అని పలువురు ఆమె భక్తి భావానికి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్త్రీ శక్తి కి ఇదే నిదర్శనం అంటూ 68 ఏళ్ల మరాఠీ మహిళ ఒంటరిగా సైకిల్ ద్వారా వైష్ణోదేవి ఆలయానికి వెళుతోంది అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నమ్మశక్యం కావడం లేదంటూ, అయినప్పటికీ నమ్మక తప్పని ఆమె తన ప్రయాణాన్ని సురక్షితంగా పూర్తి చేస్తుందని విశ్వసిస్తున్నామని చెప్తున్నారు.
Recommended Video

2200 కిలోమీటర్లు వైష్ణోదేవి ఆలయానికి సైకిల్ తొక్కుతూ వెళ్ళటం నిజంగా సాహసం
ప్రస్తుతం 20 ఏళ్ళకే కాస్త దూరం కూడా నడవలేని వాళ్ళు ఉన్నారు. కాసేపు నిలబడలేనివారు, కాసేపు సైకిల్ తోక్కితేనే క్రింద పడిపోయే వారు ఉన్నారు . అలాంటి కాలంలో ఒక వృద్ధురాలు ఉత్సాహంగా సైకిల్ తొక్కటం,ఏకంగా ఒక సహసానికే బయలుదేరటం ఆసక్తికర అంశం . మొత్తానికి 2200 కిలోమీటర్లు వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకోవటం కోసం ఓ 68 ఏళ్ల మహిళ సైకిల్ తొక్కుతూ ప్రయాణాన్ని సాగించటం నిజంగా ఆశ్చర్యకరం.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications