ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న వికలాంగుడి క్రియేటివిటీ, బిజినెస్ అసోసియేట్‌గా జాబ్ ఆఫర్

జుగాడ్ క్రియేటివిటీని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ఇప్పుడు మరో జుగాడ్ బండి ఆకట్టుకుంది. ఓ వికలాంగ వ్యక్తి రూపొందించిన వాహనాన్ని చూసి ఆశ్చర్యపోయిన మహీంద్రా, ఆయనకు ఉద్యోగం ఆఫర్ చేశారు.

Anand Manhindra

కాళ్లు, చేతులు సరిగా వృద్ధి చెందని ఓ వ్యక్తి తాను నడిపే విధంగా ఓ మూడు చక్రాల వాహనాన్ని తయారు చేశారు. ఆయన తన వాహనాన్ని నడుపుతూ, దానిపై కూర్చుకుని మాట్లాడుతున్నప్పుడు తీసిన ఒక వీడియో తాజాగా వైరల్ అయ్యింది.

ఆ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

https://twitter.com/anandmahindra/status/1475408386015612929

ఆ క్రియేటివిటీని చూసి ఆశ్చర్యపోయాని చెప్పిన మహీంద్రా.. ఆయనకు బిజినెస్ అసోసియేట్‌గా ఉద్యోగం ఇవ్వాలంటూ మహీంద్రా లాజిస్టిక్స్ సంస్థ ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేశారు. ఆ వ్యక్తి చిరునామాతో పాటు పూర్తి వివరాలను కనుక్కొనేందుకు ప్రయత్నిస్తున్నామని మహీంద్రా లాజిస్టిక్స్ సంస్థ ట్వీట్ చేసింది.

కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్రకు చెందిన ఓ వెల్డింగ్ షాపు నిర్వాహకుడు తయారు చేసిన జుగాడ్ జీపును చూసి, దానికి ఎక్స్ఛేంజ్ కింద బొలెరో వాహనాన్ని ఇస్తానని ఆనంద్ మహీంద్రా ఆఫర్ ఇచ్చారు. అయితే, ఆ జీపును ఇవ్వలేమని, ఆనంద్ మహీంద్రా కోసం మరోటి తయారు చేసిస్తామని జుగాడ్ జీపు తయారీదారుడు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+