అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. రామేశ్వరం కేఫ్ పేలుడుకు లింక్!!
అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లోని జామ్ నగర్ లో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల నుండి ప్రముఖులను ఆహ్వానించి ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు . పసందైన వంటకాలతో అతిధులకు ఆతిధ్యం ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే బెంగళూరులోని ఫేమస్ రెస్టారెంట్ అయిన అయిన రామేశ్వరం కేఫ్ లో నిన్న మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. బాగా రద్దీగా ఉన్నమధ్యాహ్నం సమయంలో ఈ బాంబు పేలుడు జరగగా పలువురు గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు, బెంగుళూరు పేలుడు ఘటనకు ఉన్న సంబంధం ఏంటి అని అలోచిస్తున్నారా? సబంధం ఉంది.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించి క్యాటరింగ్ బాధ్యతలను రామేశ్వరం కేఫ్ యజమాని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఆయన గుజరాత్ లోని జామ్ నగర్ లో బిజీగా ఉండగా .. ఈ క్రమంలోనే జరిగిన పేలుడు ఘటన ఆయనను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది.
దీంతో ఆయన హుటాహుటిన బెంగళూరుకు చేరుకున్నారు . ఈ బాంబు పేలుడులో బ్యాగుతో వచ్చిన ఒక వ్యక్తి కేఫ్ లో బ్యాగ్ ను వదిలేసి వెళ్ళిపోయాడు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి కేఫ్ కు వచ్చిన కస్టమర్లతో పాటు సిబ్బందికి గాయాలయ్యాయి. అయితే ఇది ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు .
అయితే అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ క్యాటరింగ్ రామేశ్వరం కేఫ్ యజమాని చూసుకోవటంతో ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ కి, పేలుడుకు ఏమైనా తెలియని సంబంధం ఉందేమో అన్న అనుమానం వ్యక్తం అవుతుంది. ఇదిలా ఉంటే బెంగుళూరు బాంబు పేలుడు ఘటన నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రంలోనూ అలెర్ట్ ప్రకటించి పోలీసులు విరివిగా వాహన తనిఖీలు చేస్తున్నారు. బెంగుళూరు బాంబు పేలుళ్లకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications