ఖమ్మంలో అరుదైన రాతి చిత్రాలు: స్వస్తిక్, పల్లకీమోత (పిక్చర్స్)
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఐదువేల ఏళ్ల నాటి అరుదైన రాతి చిత్రాలు ఉన్నట్లు చరిత్రకారుడు డాక్టర్ ద్యావనవల్లి సత్యనారాయణ చెప్పారు. మానవ చరిత్రకు మాత్రమే కాకుండా లలితకళలకు కూడా మొదటి ప్రధాన ఆధారాలైన చిత్రలేఖనాలు రాతి గుహల్లో కనిపిస్తున్నాయన్నారు.
తెలంగాణలో అలాంటివి ఇప్పటి వరకు 18 స్థానాల్లో కనిపించాయన్నారు. ఖమ్మం జిల్లా ముకలకపల్లి మండలం నల్లముడి శివారు అడవుల్లోని గుహల్లో కనుక్కున్న రాతి చిత్రలేఖనాలను మొదటిసారిగా వెలుగులోకి తెస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఖమ్మం జిల్లా పాల్వంచ-మాదారం-కమలాపూర్ మీదుగా 30 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు చేరుకోవచ్చునని చెప్పారు. ఇక్కడి చరతిర పూర్వపుయుగ చిత్రలేఖనాలున్న గుహను స్థానిక నాయకపోడు గిరిజనుల అక్షరాల లొద్ది అని పిలుస్తారన్నారు. దేవతలను ఆనాడే ఊరేగించినట్లు తెలిపే పల్లకీ మోత చిత్రం కనిపిస్తోందన్నారు.

ఖమ్మంలో రాతి చిత్రాలు
మానవుడి చరిత్రకు మాత్రమే కాకుండా అతడి లలితకళలకు కూడా మొట్టమొదటి ప్రధాన ఆధారాలైన చిత్రలేఖనాలు రాతి గుహల్లో కన్పిస్తున్నాయి.

ఖమ్మంలో రాతి చిత్రాలు
తెలంగాణలో అలాంటివి ఇప్పటి వరకు 18 స్థలాల్లో కన్పించాయి. ఈ మధ్య అలాంటి రాతి చిత్రలేఖనాలను పరిశోధకుడు డాక్టర్ ద్యావనపల్లి మరో రెండు స్థలాల్లో గుర్తించారు.

ఖమ్మంలో రాతి చిత్రాలు
ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలం నల్లముడి గ్రామశివారు అటవీ గుహల్లో ఆయన వీటిని కనుగొన్నారు. ఇక్కడికి ఖమ్మం జిల్లా పాల్వంచ-మాదారం-కమలాపూర్ మీదుగా 30 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవచ్చు.

ఖమ్మంలో రాతి చిత్రాలు
చరిత్ర పూర్వ యుగపు చిత్రలేఖనాలున్న గుహను స్థానిక నాయకపోడు గిరిజనులు అక్షరాల లొద్ది అని పిలుస్తారు.
సుమారు పది మీటర్ల పొడవు, ఏడు మీటర్ల ఎత్తులో దక్షిణాభిముఖంగా సెలయేరు ఒడ్డున ఉన్న ఈ గుహలో మూడు యుగాల మూడు రకాల చిత్రలేఖనాలున్నాయి.

ఖమ్మంలో రాతి చిత్రాలు
ఈ గుహలో ఎరుపు రంగు చిత్రాలు, రేఖా చిత్రాలు (తొలిచినవి), తొలిచిన చిత్రాల్లో రంగు పూసినవి మొత్తం మూడు రకాల చిత్రలేఖనాలున్నాయి.

ఖమ్మంలో రాతి చిత్రాలు
చివరి చిత్రాలు చాలా అరుదైనవని ఆయన తెలిపారు.. ఇలాంటివి మహబూబ్‌నగర్ జిల్లా దొంగలబండ తండాలో, ఒడిశాలో ఒక చోట, దక్షిణాఫ్రికా, స్పానిష్ కాండబ్రియాలో ఇప్పటి వరకు వెలుగుచూశాయని నిపుణులు రాశారని పేర్కొన్నారు.

ఖమ్మంలో రాతి చిత్రాలు
ఇవి మధ్యరాతి యుగానికి అంటే ఇప్పటికీ కనీసం ఐదువేల సంవత్సరాల కిందటివి. ఈ చిత్రాల్లో ప్రధానంగా జంతువులు, దేవతలు, మానవ కార్యకలాపాలు కన్పిస్తున్నాయి.

ఖమ్మంలో రాతి చిత్రాలు
తెలంగాణకు ఆనాడే ఇతర ప్రాంతాలతో గల వ్యాపార సంబంధాలను, వ్యవసాయ ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయని ద్యావనపల్లి సత్యనారాయణ తెలిపారు.

ఖమ్మంలో రాతి చిత్రాలు
బాణం పుల్లను నిలబెట్టినట్లు ఏడు చిత్రాలు సప్తమాతృకలకు సప్తసంతానాలను ఇచ్చే దేవతలుగా చెప్పవచ్చునని ఆయన పేర్కొన్నారు.

ఖమ్మంలో రాతి చిత్రాలు
ఓం అక్షరానికి పూర్వరూపంగా మేధావులు భావిస్తున్న స్వస్తిక్ చిత్రంతో మన ఘన సంస్కృతి వారసత్వం పట్ల మనకు గౌరవం ఇనుమడిస్తుందన్నారు.

ఖమ్మంలో రాతి చిత్రాలు
ఈ చిత్రాల్లో చాలా వరకు రాక్షస గుళ్ళ యుగానికి చెందినదని ప్రాథమిక పరిశోధనలో తేలింది. ఏమైనా ఇక్కడి చిత్రాలు, వాటిని దైవంగా భావించిన ప్రజలు క్రీ.పూ. 3 వేల సంవత్సరాల నుంచి క్రీ. శ. 2వ శతాబ్దం మధ్య మనుగడ సాగించారని చెప్పవచ్చునన్నారు.

ఖమ్మంలో రాతి చిత్రాలు
ఈ చిత్రాలు విధ్వంసానికి గురికాకముందే ప్రభుత్వ పురావస్తు శాఖ వాటిని కాపాడి భావితరాలకు అందించాలని కోరారు. ఈ నెల 8న ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి 63వ జన్మదినం వారికి తన పరిశోధనను అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

ఖమ్మంలో రాతి చిత్రాలు
కొన్ని చిత్రాలు తెలంగాణకు ఆనాడే ఇతర ప్రాంతాలతో గల వ్యాపార సంబంధాలను, వ్యవసాయ ప్రాధాన్యాన్ని వివరిస్తున్నాయని చెప్పారు.

ఖమ్మంలో రాతి చిత్రాలు
స్వస్తిక్ చిత్రాన్ని చిత్రించడం చూస్తే నాటి నుండి ఉన్న సంస్కృతి- వారసత్వం పట్ల గౌరవం ఇనుమడిస్తుందని ఆయన చెప్పారు.

ఖమ్మంలో రాతి చిత్రాలు
ఎద్దు రేఖా చిత్రాలు నవీన శిలాయుగానికి చెందినవి కాగా, ఏనుగులు దేవతా సంబంధ చిత్రాల్లో చాలా వరకు రాక్షస గుళ్ల యుగానికి చెందినవని ప్రాథమిక పరిశోధనలో తేలింది.

ఖమ్మంలో రాతి చిత్రాలు
ఈ గుహ చిత్రాలను స్థానిక నాయకపోడు గిరిజనులు పవిత్రంగా భావిస్తూ.. ఏటా జాతర నిర్వహిస్తూ కాపాడుతున్నారని తెలిపారు.

ఖమ్మంలో రాతి చిత్రాలు
ఇలాంటి అరుదైన పురాతన వస్తువులు విధ్వంసానికి గురికాకముందే పురావస్తు శాఖ వాటిని కాపాడే చర్యలు తీసుకొని భావితరాలకు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications