మైసూర్ ప్యాలెస్‌లో వెలుగు చూసిన భారీ సొరంగం..!

బెంగుళూరు: భారత్‌లో అద్భుత కట్టడమైన మైసూరు ప్యాలెస్‌కు సమీపంలో ఓ భారీ సొరంగ మార్గం వెలుగు చూసింది. మైసూరులోని విశ్వమానవ పార్క్ వద్దరహదారి విస్తరణ పనులు చేస్తుండగా బుధవారం ఈ సొరంగం బయట పడింది. సుమారు మూడు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల ఎత్తులో ఈ సొరంగం అర కిలోమీటర్‌కు పైగా పొడవున్నట్లు అధికారులు గుర్తించారు. ప్యాలెస్ నుంచి రాజుల ఆయుధ తయారీ కేంద్రం గన్ హౌస్ వరకూ ఇది ఉంది.

ఈ సొరంగ మార్గాన్ని గతంలో రాజులు రహస్య మార్గంగా వాడుకున్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రాచనగరి మైసూరులో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. మైసూరును కర్ణాటక రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా చెప్పుకుంటారు.

Ancient tunnel unearthed near Mysore Palace

మైసూరులో అనేక మైసూరు ప్యాలెస్ లాంటి అనేక ప్యాలెస్ లు కొలువుతీరి ఉండడం వలన మహాసౌధాల నగరంగా తరచు వ్యవహరిస్తున్నారు. జగన్మోహన ప్యాలెస్‌ను ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీగా మార్చారు. రాజేంద్ర విలాస్ చాముండి హిల్స్ మీద ఉంటుంది.

లలితా మహల్‌ను ఇప్పుడు హోటల్‌గా మార్చారు. జయలక్ష్మి విలాస్ మైసూరు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉంది. మైసూరు ప్యాలెస్ లోని ప్రధాన భాగం 1897 లోకాలిపోయింది. ఇప్పుడున్న భవనాలు అదే స్థలంలో నిర్మించారు. దీని వెలుపలి భాగం ఇండో-సరాసెనిక్ పద్దతిలోనూ, లోపలి భాగం హోయసాల పద్దతిలో నిర్మించబడ్డాయి.

మైసూరు నల్ల చెక్క (రోజ్ వుడ్) పొదిగిన కళాఖండములకు ప్రసిద్ది. స్వచ్ఛమైన పట్టు మరియు బంగారు జరీతో నేసే చీరలు మైసూరు పట్టు చీరలు గా ప్రసిద్ధికెక్కాయి. మైసూర్ అనే పేరు నుంచి మైసూరు పెయింటింగ్, మైసూర్ పాక్ అనే మిఠాయి, మైసూర్ సిల్క్ అనే వస్త్రాలు ప్రాచుర్యం పొందాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+