బోడో చెర నుంచి జగన్ పార్టీ నేత, కాంట్రాక్టర్ విడుదల
హైదరాబాద్:వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డి బోడో తీవ్రవాదుల చెర నుంచి సోమవారం నాడు విడుదలయ్యారు. ఆయన క్షేమంగా ఉన్నారని మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. అసోంలో కిడ్నాప్ చేసిన ఆయనను బోడో మిలిటెంట్లు బీహార్‌లోని పాట్నాలో వదిలేశారు. మహేశ్వర్ రెడ్డి విడుదలైన విషయాన్ని హైదరాబాద్ పోలీసులు కూడా ధ్రువీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
అసోం రాష్ట్రంలో బోడో మిలిటెంట్లు కడప జిల్లాకు చెందిన కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ చేశారు. కడప జిల్లా రామాపురం మండలం హసనాపురం గ్రామానికి చెందిన క్లాస్-1 కాంట్రాక్టర్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పప్పిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి(50)ని బోడో మిలిటెంట్లు ఆదివారం తెల్లవారుజామున కిడ్నాప్ చేశారు. దాంతో ఆయన కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో నివాసం ఉంటున్న కడప జిల్లాకు చెందిన పబ్బిరెడ్డి మహేశ్వరరెడ్డి ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. అందులో భాగంగా అసోం రాష్ట్రం దీవార్ జిల్లా గోహిత్ దీవాస్ ఏజెన్సీ ప్రాంతంలో ఓ బడా కంపెనీ నుంచి పనులు తీసుకుని సబ్ కాంట్రాక్టర్‌గా గత రెండేళ్లుగా పనులు చేయిస్తున్నాడు.

మిలిటెంట్లు కిడ్నాప్ చేసే అవకాశముందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారాన్ని దీవార్ జిల్లా ఎస్పీ కాంట్రాక్టర్ దృష్టికి తీసుకువెళ్ళడంతో అప్రమత్తంగా ఉండాలని, గన్‌మెన్‌లను కేటాయస్తామని చెప్పారు. అయితే తాను హైదరాబాద్ వెళ్తున్నానని గన్‌మెన్లు అవసరం లేదని ఎస్పీకి చెప్పి మహేశ్వర్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున బయలుదేరినట్లు తెలుస్తోంది. మహేశ్వర్‌రెడ్డి, ఇంజినీర్ వాహనంలో విమానాశ్రయానికి వెళ్తుండగా మార్గమధ్యంలో బోడో మిలిమెంట్లు వీరిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం.
కొద్దిదూరం వెళ్లిన తరువాత ఇంజినీర్ బాబూరావును వదిలేసి మహేశ్వర్‌రెడ్డిని వెంట తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ కిడ్నాప్ సమాచారాన్ని అసోం పోలీసులు రాష్ట్ర పోలీసులకు చేరవేసినట్లు సమాచారం. కాంట్రాక్టర్ మహేశ్వర్‌రెడ్డిని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మహేశ్వర్‌రెడ్డి గతంలో హసనాపురం సర్పంచ్‌గా పనిచేశారు. తమ పార్టీ నేత, కాంట్రాక్టర్ మహేశ్వర్‌రెడ్డి కిడ్నాప్ విషయాన్ని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు అధినేత జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.
తనను వదిలేసిన తర్వాత బాబూరావు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. మహేశ్వర రెడ్డిని వదిలేయడానికి బోడో తీవ్రవాదులు రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. మహేశ్వర రెడ్డి కిడ్నాప్ వ్యవహారంపై అసోం ప్రభుత్వం సమీక్ష చేస్తోంది. నలుగురు బోడో తీవ్రవాదులు మోటార్ సైకిళ్లపై మహేశ్వర రెడ్డిని కిడ్పాన్ చేసుకుని తీసుకెళ్లారు. ఈ స్థితిలో మహేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులు అసోం వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications