అస్సాంలో కిడ్నాపైన ఆంధ్ర ఇంజనీర్ విడుదల

షిల్లాంగ్/ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంజనీర్ నాగ మల్లేశ్వర రావును అసోం పోలీసులు సోమవారం రక్షించారు. ఆంధ్రా ఇంజనీర్ క్షేమంగా బయటపడ్డట్లు అడిషనల్ డీజీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు. అతనిని విడిపించేందుకు ఎపి ప్రభుత్వం అసోం అధికారులతో మాట్లాడింది. నాగమల్లేశ్వర రావు 17న అపహరణకు గురయ్యారు. ఆదివారం ఎపి సిఎస్ అసోం అధికారులతో మాట్లాడారు.

కాగా, ఎపికి చెందిన ఇంజనీర్ బండ్లమూడి నాగ మల్లేశ్వరరావు (36)ను విడిచిపెట్టాలంటే రూ.6 కోట్లు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అసోంలోని హఫ్లాంగ్ సమీపాన బోడో తీవ్రవాదులుగా భావి స్తున్నవారు ఆరు రోజుల కిందట ఆయనను కిడ్నాప్ చేశారు.

Andhra engineer abducted by Bodo terrorists, released

అయితే, ఇది స్థానిక ముఠాల దుశ్చర్యేనని, తీవ్రవాదుల ప్రమేయం లేదని భావిస్తున్నట్లు దిమా హసావో జిల్లా ఎస్పీ వేదాంత రాజ్‌ఖోవా ఆదివారం చెప్పారు. అలాగే ఆయన విడుదలకు కిడ్నాపర్లు భారీగా డబ్బు డిమాండ్ చేశారన్న వార్తలో వాస్తవాలు తేలాల్సి ఉందని అసోం ఏడీజీపీ అజిత్ ప్రసాద్ రౌత్ చెప్పారు.

ఇంజనీర్‌ను రక్షించేందుకు తమతోపాటు సైన్యం కూడా రంగంలో దిగిందన్నారు. ప్రస్తుతం ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని తెలిపారు.

కిడ్నాప్‌కు గురైన ఇంజనీర్ ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కె.వి.పాలెం నివాసి. ఆయన ఏపీకి చెందిన వశిష్ట కన్‌స్ట్రక్షన్స్ సంస్థలో రాళ్లు పగులగొట్టే యూనిట్ మేనేజర్‌గా అక్కడ పనిచేస్తున్నారు. ఆయనను సురక్షితంగా విడిపించే దిశగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు అసోం సీఎస్‌తో మాట్లాడారు. ఈ నేపథ్యంలో సోమవారం నాగమల్లేశ్వర రావును విడిపించడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+