కరగని చంద్రబాబు: ఎపి ఆఫర్‌కు బాలీవుడ్ దంపతులు నో

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండడానికి బాలీవుడ్ దంపతులు అజయ్ దేవగన్, కాజోల్ నిరాకరించారు. తమ నిర్ణయాన్ని నోటి మాటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. వారు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండడానికి నిరాకరించడం వెనక పెద్ద కథనే ఉందని మీడియాలో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తోంది.

అజయ్ దేవగన్ దంపతులు ఏప్రిల్ 12వ తేదీన విజయవాడకు వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి తమ వాణిజ్య ప్రతిపాదనలను ఆయన ముందుంచారు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం - తన సన్నిహితుడికి ప్రాజెక్టును కేటాయించాలని అజయ్ దేవదన్ చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది.

Andhra Pradesh refuses to yield, ‘star’ says no honour

ఆ ప్రాజెక్టు లైడర్ సర్వే టెక్నాలజీకి సంబంధించింది. ప్రత్యేకమైన ఫొటోగ్రాఫ్‌లు తీసుకని జియో ట్యాగ్ చేసే ప్రాజెక్టు అది. అజయ్ దేవగన్ ఆ ప్రాజెక్టుపై చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారని అంటున్నారు. చంద్రబాబుకు అది ఎంతో నచ్చిందని, దాంతో ఎపి టూరిజం బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని చంద్రబాబు వారిని అడిగినట్లు తెలుస్తోంది.

ఆ మేరకు ఒప్పందం జరగలేదు. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య చర్చలు కూడా సాగలేదు. ఆ తర్వాత అజయ్ దేవగన్ మరో ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఉంచాడని దక్కన్ క్రానికల్ రాసింది. ఆ ప్రాజెక్టులో భాగంగా దుబాయ్ మోడల్ వర్చ్యువల్ టెక్నాలజీ స్టూడియో నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ విషయంలో కూడా ఎపి ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. దీంతో బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలనే ఆలోచనను బాలీవుడ్ దంపతులు విరమించుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bollywood actor Ajay Devgn and his wife Kajol have reportedly refused to be the brand ambassadors of Andhra Pradesh Tourism. An oral communication in this regard has reached the government, sources said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి