చెన్నై హోటల్లో ఆంధ్ర లేడీ టెక్కీ శవం: ఆత్మహత్య?
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మరణించింది. వెలాచెరీలోని ఓ హోటల్లో ఆమె శవం కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని చెన్నై పోలీసులు భావిస్తున్నారు.
మరణించిన మహిళా టెక్కీని కురుల తేజగా గుర్తించారు. ఆమె ఓ ఐటి కంపెనీలో పనిచేస్తోంది. జులై 15వ తేదీన ఆమె హోటల్ గదిని బుక్ చేసుకుంది. నిజానికి ఆమె వేలాచెరిలోని ఓ మహిలా హాస్టల్లో ఉంటోంది. ఆత్మహత్య చేసుకోవడానికే ఆమె హోటల్ గది తీసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు.

ఆమె విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు అంటున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె వయస్సు 29 ఏళ్లు.
తమిళనాడు రాజధాని చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కొన్ని ఉన్నాయి. మానసిక ఒత్తిడి, తదితర కారణాల వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications