అఖిల్ ఆ సినిమాకు సెట్ అవ్వడేమోనని భయపడ్డా.. నాగార్జున సంచలనం

ఒక్క హిట్టు.. ఒకే ఒక్క హిట్టు అన్నట్లుగా ప్రస్తుతం టాలీవుడ్ సక్సెస్ కోసం పరితపిస్తున్న హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు. 1995 లోనే ఏడాదిన్నర వయసులోనే సిసింద్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్. పెద్దయ్యాక 2014 లో మనం చిత్రంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా క్లైమాక్స్ లో అఖిల్ ఎంట్రీకి థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ చిత్రాలతో మెప్పించారు. కానీ ఇవేవీ ఆశించినంత విజయాన్ని అందించలేదు.

దాంతో ఈ సారి మరింత కసిగా అక్కినేని అఖిల్ చేసిన చిత్రం లెనిన్.. ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ట్రైలర్ ఉత్కంఠభరితంగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో లెనిన్ మూవీ ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. చూస్తుంటే ఈ సారి అయ్యగారు కచ్చితంగా హిట్టు కొట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. చివరి వరకూ ఆసక్తి కరంగా ఉంది. గ్రామీణ నేపథ్యం, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా తిరుపతిలో లెనిన్ ప్రీ రిలీజ్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు కింగ్ నాగార్జున గెస్ట్ గా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో లెనిన్ సినిమాపై కింగ్ నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌గా మారాయి. తన కొడుకు నటనపై మొదట కలిగిన భయం, ఆ తర్వాత కలిగిన ఆశ్చర్యం గురించి ప్రస్తావించారు. లెనిన్ మూవీ సీమ మట్టి మనుషుల కథ.. ఇది సీమలో జరుగుతున్న మహాభారతం.. అఖిల్ ఇప్పటివరకూ అన్ని అర్బన్ సినిమాలే చేశాడు.

Lenin Movie Starring Akhil Set for Grand July 10 Release Nagarjuna Shares Key Comments at PreEvent

ఈ సినిమాకు అసలు సెట్ అవుతాడా..? చేస్తాడా..? అన్న భయం వేసింది. కానీ సినిమా చూసిన తర్వాత నాతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు.. అని నాగార్జున పేర్కొన్నారు. అలాగే మీరు కూడా సినిమా చూశాక లెనిన్ స్నేహం, పగని ప్రేమిస్తారు అని తెలిపారు. జులై 10 న వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు అని నాగార్జున అనగానే ఫ్యాన్స్ అంతా కేరింతలు, విజిల్స్ లో గ్రౌండ్ మొత్తం హోరెత్తిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+