116 ఏళ్ల నవనీతమ్మకు శ్రీవారి ప్రత్యేక దర్శనం - అరుదైన అవకాశం..!!
తిరుమలలో ఆ భక్తురాలికి అరుదైన అవకాశం దక్కింది. 116 ఏళ్ల వయసులో నవనీతమ్మ ప్రత్యేక దర్శనం లో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ వయసులోనూ అలిపిరి కాలినడక మార్గం ద్వారా మెట్లు ఎక్కుతూ కొండపైకి చేరుకోవడం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల అభినందనలు అందుకున్నారు. గుర్తించిన టీటీడీ ఈ రోజు ప్రత్యేకంగా వీఐపీ దర్శనం ప్రత్యేక మార్గంలో కల్పించి గుర్తించారు. వీఐపీ ప్రోటోకాల్ తరహాలో ప్రత్యేకంగా ఆలయ సంప్రదాయాల మేరకు ఆశీర్వాదం.. ప్రసాదాలు అందించారు.
116 ఏళ్ల నవనీతమ్మ భక్తికి తగినట్లుగా టీటీడీ ఈ రోజు ప్రత్యేకంగా గౌరవించింది. తమిళనాడు కు చెందిన నవనీతమ్మ శనివారం అలిపిరి కాలి నడక మార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల చేరుకున్నారు. ఆ వయసులో అన్ని మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో, టీటీడీ ఛైర్మన్ ఆ భక్తురాలికి ప్రత్యేక అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. విజిలెన్స్ సిబ్బంది ద్వారా ఆ భక్తురాలి వివరాలు సేకరించి.. తిరుమలకు రావాలని సూచించారు. దీంతో, నవనీతమ్మతో సహా కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. ఆలయ బయోమెట్రిక్ మార్గం గుండా ఆమెకు సులభంగా లోపలికి ప్రవేశం కల్పించారు.

ఆలయంలో ఆశీర్వాదం.. ప్రసాదాలు అందించి
నవనీతమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి ఆశీస్సులు అందజేశారు. 116 ఏళ్ల వయసులో నవనీతమ్మ కు శ్రీవారి పై ఉన్న విశ్వాసానికి అనుగుణంగా అరుదైన అవకాశం దక్కింది. ప్రత్యేక దర్శనం చేసుకోవటంతో పాటుగా ఆశీర్వాదం.. ప్రసాదాలు అందుకున్నారు. అంతే కాదు 116 ఏళ్ల నవనీతమ్మకు టీటీడీ ఈవో అరుదైన గౌరవం అందించారు. ఇప్పుడు శ్రీవారి భక్తుల్లో నవనీతమ్మ దర్శనం వ్యవహారం వైరల్ అవుతోంది.













Click it and Unblock the Notifications