విశాఖ-బెంగళూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

ప్రస్తుతం ఏపీలో అత్యంత రద్దీ ఉన్న రూట్లలో విశాఖపట్నం -బెంగళూరు (Visakhapatnam- Bengaluru) మార్గం కూడా ఒకటి. బెంగళూరులో ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వారాంతంలో ఉత్తరాంధ్రలోని తమ స్వస్థలాలకు రావడం, తిరిగి వెళ్లడం కారణంగా ఈ రూట్లో రద్దీ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ కోస్తా రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లను మరికొంతకాలం పొడిగించాలని అధికారులు నిర్ణయించారు.

విశాఖ –ముంబై lTT ఎక్స్‌ప్రెస్‌కు గోదావరి జిల్లాల్లో కొత్త హాల్ట్..!
విశాఖ –ముంబై lTT ఎక్స్‌ప్రెస్‌కు గోదావరి జిల్లాల్లో కొత్త హాల్ట్..!

విశాఖపట్నం నుంచి ఎస్ఎంవీటీ బెంగళూరుకు ప్రతీ శుక్రవారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 08581 గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 25 వరకూ నడపాలని దక్షిణ కోస్తా రైల్వే నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్ఎంవీటీ బెంగళూరు నుంచి విశాఖపట్నానికి ప్రతీ శనివారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 08507 గడువు ఆగస్టు 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ రైలును తిరిగి ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 26 వరకూ నడపబోతున్నారు.

visakhapatnam-bengaluru special trains extended till September end
Vande Bharat Express: నెల్లూరులో వందే భారత్ టైమింగ్ మార్పు..!
Vande Bharat Express: నెల్లూరులో వందే భారత్ టైమింగ్ మార్పు..!

ప్రస్తుతం ఈ రెండు రైళ్లు నడుపుతున్న రూట్ , సమయాలు, కోచ్ లు, హాల్ట్ లు ఏమీ మారకుండా అలాగే కొనసాగుతాయని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్ల కోసం పెరుగుతున్న డిమాండ్ ఆధారంగా రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వారాంతంలో ఈ రెండు స్టేషన్ల మధ్య రద్దీ ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కాబట్టి విశాఖ - బెంగళూరు మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు ఈ ప్రకటనను గమనించి తదనుగుణంగా రిజర్వేషన్లు చేయించుకోవాల్సిందిగా అధికారులు కోరుతున్నారు.

Satavahana Express: శాతవాహన ఎక్స్ ప్రెస్ కు ఓ తాత్కాలిక హాల్ట్..!
Satavahana Express: శాతవాహన ఎక్స్ ప్రెస్ కు ఓ తాత్కాలిక హాల్ట్..!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+