ప్రియురాలి గదిలోనే భార్య హతం.. ఆపై ఇద్దరూ నేపాల్‌కు జంప్!

పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్యోదంతం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మరిచిపోక ముందే.. హర్యానాలోని గురుగ్రామ్‌‌లో అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన మూడేళ్ల ప్రేమ బంధానికి అడ్డు వస్తోందని.. ఓ కిరాతక భర్త పెళ్లయిన 3 నెలలకే ప్రియురాలితో కలిసి భార్యను దారుణంగా కాల్చి చంపాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లోని మానేసర్‌లో ఈ దారుణం జరిగింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మానేసర్‌కు చెందిన 25 ఏళ్ల అంకిత్ అనే యువకుడికి ఈ ఏడాది ఫిబ్రవరిలో 22 ఏళ్ల యువతితో పెళ్లి జరిగింది. అయితే మే 21న ఆమె అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా.. అత్తవారింటి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలి తల్లి మే 22న మానేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. అదే రోజు మానేసర్‌లోని ఓ గదిలో సదరు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆమెను తుపాకీతో కాల్చి చంపినట్లు తేలడంతో పోలీసులు ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Gurugram Horror Man Kills Wife at Girlfriend House 3 months after marriage and Flees to Nepal

ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అంకిత్‌కు మానేసర్లో పొగాకు దుకాణం ఉంది. అదే ప్రాంతంలోని బ్యూటీ పార్లర్‌లో పనిచేసే 38 ఏళ్ల రజనీదేవితో అతనికి గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. పెళ్లయిన తర్వాత కూడా వారి బంధాన్ని కొనసాగించడానికి అంకిత్ భార్య అడ్డుగా మారిందని భావించిన ఈ ఇద్దరూ ఆమెను వదిలించుకోవాలని పథకం వేశారు. ఇందుకోసం రజనీ దేవి అద్దెకు ఉంటున్న గదిలోనే హత్యకు ప్లాన్ చేశారు. పథకం ప్రకారం.. రెండు నెలల క్రితమే ఉత్తరప్రదేశ్ నుంచి ఒక తుపాకీని కూడా కొనుగోలు చేశారు.

మే 21న అంకిత్ తన భార్యను నమ్మించి ప్రియురాలైన రజనీ దేవి గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి ఆమెపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఆ తర్వాత నిందితులిద్దరూ కలిసి హరిద్వార్ మీదుగా నేపాల్‌కు పారిపోయారు. దాదాపు నెలరోజుల పాటు పోలీసుల కళ్లు గప్పి తిరిగిన వీరు.. జూన్ 30న తిరిగి ఇండియాకు చేరుకోగానే మానేసర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా.. 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం ఈ కేసులో హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని రికవరీ చేసేందుకు మరిన్ని ఆధారాలను సేకరించేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+