నందిని VS అమూల్, ఆంధ్రా మిల్క్ కు ఎఫెక్ట్ ?, బీజేపీ రివర్స్ గేర్, బాబు హెరిటేజ్, అండ్ కో !

బెంగళూరు/తిరుపతి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు నందిని పాలు VS అమూల్ ప్రధాన చర్చకు, రాజకీయ ఆరోపణలకు దారితీసింది. నందిని గొంతు కోయ్యడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ నాయకులు గుజరాత్ కు చెందిన అమూల్ ను కర్ణాటకలోకి తెస్తోందని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రా మిల్క్ గొడవ తెర మీదకు రావడం హాట్ టాపిక్ అయ్యింది.

ఇదే సమయంలో బెంగళూరుతో పాటు కర్ణాటలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన పలు కంపెనీల పాలు రాజ్యం ఎలుతున్నాయని, ఆంధ్రా పాలు, తమిళనాడు పాలు విక్రయాలకు లేని సమస్య అమూల్ తో ఏమి వచ్చిందని, ఇది కచ్చితంగా పొలిటికల్ గిమ్మిక్కు అని బెంగళూరు సౌత్ లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడుకు చెందిన ఆరోగ్య పాలు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన హెరిటేజ్, దోడ్లా, తిరుమల పాలు, పాల ఉత్పత్తులు చాలా సంవత్సరాల నుంచి బెంగళూరు సిటీతో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో విక్రయిస్తున్నారని, ఇంతకాలం వాటిని అడ్డుకోని కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ నాయకులు ఇప్పుడు గుజరాత్ కు చెందిన అముల్ కర్ణాటకలోకి వస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రశ్నించారు.

 karnatakaelections

కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం సిద్దరామయ్య రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి అమూల్ ను అస్త్రంగా చేసుకున్నారని, దానికి ఆ పార్టీ నాయులతో పాటు జేడీఎస్ నాయకులు తానా అంటే ఆపార్టీ కార్యకర్తలు తందానా అంటున్నారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల పాలు కర్ణాటకలో విక్రయిస్తున్నా నందిని సంస్థకు ఎలాంటి నష్టం రాలేదని, ఇప్పుడ అమూల్ వలన నందినికి ఎలాంటి నష్టం రాదని తేజస్వీ సూర్య అంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా గుజరాత్ నుంచి వచ్చి నేడు భారతదేశంలో నెంబర్ నాయకులు అయ్యారని, అదే గుజరాత్ కు చెందిన అమూల్ సంస్థను అడ్డం పెట్టుకుని ఇద్దరు నాయకుల మీద విమర్శలు చేసి రాజకీయంగా లబ్దిపొందడానికి సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులు, జేడీఎస్ లీడర్స్ కంకణం కట్టుకున్నారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయడి కుటుంబ సభ్యులకు చెందిన హెరిటేజ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన దొడ్ల, తిరుమల పాలు ప్రతిరోజు కొన్ని లక్షల లీటర్లు కర్ణాటకలో విక్రయిస్తున్నారు. ఇప్పుడు అమూల్ ను కర్ణాటకలోకి బీజేపీ నాయకులు ఆహ్వానించి నందిని గొంతు కొయ్యడానికి ప్రయత్నిస్తున్నారని కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి మండిపడుతున్నారు.

tejasvi

నందిని సంస్థను నామరూపాలు లేకుండా చెయ్యడానికి ప్రధాని మోదీ, అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ సేవ్ నందిని, గో బ్యాక్ అమూల్ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సోషల్ మీడియా పోరాటానికి కర్ణాటకలో ఊహించని మద్దతు వస్తోంది. రైతులు, కన్నడ సంఘ, సంస్థలు నందినికి మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఊహించని మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు అమూల్ వివాదం దారి తప్పించడానికి కొందరు బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ పాలు వ్యవహారం తెర మీదకు తీసుకువస్తున్నారని స్పష్టంగా వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+