ఆందోళనకు అనుమతివ్వండి: ప్రధాని మోడీకి అన్నా హజారే లేఖ

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హాజరే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రైతులకు చెందిన అంశాలపై ఢిల్లీలో అందోళన చేపట్టేందుకు జన్‌లోక్‌పాల్‌కు అనుమతి ఇవ్వాలని ప్రధానమంత్రి మోడీని అన్నాహజారే ఆ లేఖలో కోరారు.

మార్చి 23న నిరసన చేపట్టేందుకు ఓ ప్రదేశాన్ని సూచించి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఇదే అంశంపై గత సంవత్సరం నుంచి సంబంధిత శాఖలకు, కేంద్ర హోంమంత్రికి లేఖలు రాస్తున్నా.. వారి నుంచి ప్రతిస్పందన లేకపోవడంతోనే ప్రధానికే లేఖ రాసినట్లు అన్నా హజారే తెలిపారు.

Anna Hazare writes to PM for space in Delhi to organise agitation

లోక్‌పాల్‌, లోకాయుక్త బిల్లు అమలు చేయాలని ప్రధానికి 43 లేఖలు రాశానని.. ఏ ఒక్కదానికి సమాధానం రాలేదని హజారే తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని కేంద్రం బలహీనపరించిందని ఆయన ఆరోపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anti-corruption crusader Anna Hazare on Monday said that he had sent a letter to Prime Minister Narendra Modi asking for space to organise his agitation on the Jan Lokpal and farmers issues scheduled from March 23.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి