సీజేపీ వెనుక బీజేపీ ? మోడీ టార్గెట్ గా అన్నామలై తీవ్ర విమర్శలు..!

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపడాన్ని తప్పుబడుతూ బీజేపీ మాజీ నేత అన్నామలై తాజాగా (Annamalai) కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీ 2011లో చేసిన వ్యాఖ్యల్ని ఆయనకు గుర్తుచేశారు. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉంటూ తన చేతులు కట్టేయకుండా ఉంటే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేసేవాడినన్న మోడీ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని అన్నామలై తెలిపారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో అవినీతికి వ్యతిరేకంగా శాంతియుతంగా సాగుతున్న ఉద్యమంపై పోలీసులు అణచివేత చర్యలకు దిగడంపై స్పందిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు.

కానీ ఇవాళ మిమ్మల్ని నిరవధికంగా జైలులో ఉంచవచ్చు, మీరు సమర్పించిన పూచీకత్తులను తిరస్కరించవచ్చు, అంతేకాకుండా, నిరోధక పూచీకత్తులకు సంబంధించిన కేసులను విచారించే అధికారం కలిగిన స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, ఆశ్చర్యకరంగా, మిమ్మల్ని తన చుట్టూ తిప్పించుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన ప్రక్రియ ఉల్లంఘనను మీరు ప్రశ్నిస్తే, మీపై రకరకాల ముద్రలు వేస్తారు. మీరు విదేశీ ఏజెంట్ అని ఆరోపిస్తూ, అనేక విమర్శలు, దాడులకు దిగుతారంటూ బీజేపీ నేతలకు, ప్రధాని మోడీకి చురకలు అంటించారు.

Annamalai Cites Modi s 2011 Remark to Defend CJP Protests Questions Delhi Police

నీట్ నిరసనల సమయంలో ఆందోళనకారులతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాను కోరినప్పటి నుంచి నిరంతరం విమర్శలు ఎదుర్కుంటున్నట్లు తెలిపారు. అయితే, తమిళనాడులో క్షేత్రస్థాయిలోని సమస్యలపై దృష్టి పెట్టడం ముఖ్యమని భావించి, ఆ విమర్శలను పట్టించుకోలేదన్నారు. ఒక రకంగా చెప్పాలంటే, ఈ విమర్శలను తాను ఆస్వాదించానన్నారు. తాను నేను బీజేపీ బీ టీమ్‌నని, ధురంధర్‌గా తమిళనాడుకు పంపించబడ్డాననే ముద్రను అవి త్వరగా తొలగిస్తాయని భావించానన్నారు.
నిన్న మీడియా సమావేశంలో సీజేపీ ఆందోళనకారులను ఢిల్లీ పోలీసులు నిర్బంధించిన తీరును తాను ప్రశ్నించినట్లు తెలిపారు.
ఊహించినట్లుగానే, నిన్నటి నుంచి మళ్లీ తనపై విమర్శలు మొదలయ్యాయన్నారు. బీజేపీలోని కొందరికి ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నానన్నారు. మీకు నచ్చిన విషయాలనే గుర్తుంచుకునే అలవాటు ఉన్నా, తాను 2026 జూన్ 5న బీజేపీని వీడానన్న విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోవాలన్నారు.

తాను నిన్న చెప్పినట్లుగానే, సీజేపీ అనుసరించే వ్యూహాలతో ఏకీభవించకపోవచ్చని, వారి విధానాల్లో చాలా వరకు తప్పుదారి పట్టించే అంశాలు ఉన్నాయని కూడా తాను భావిస్తున్నట్లు అన్నామలై తెలిపారు. అయితే, తమకు ముఖ్యమైనదిగా అనిపించే అంశంపై వ్యతిరేకత వ్యక్తం చేయడానికి, వాదించడానికి లేదా నిరసన తెలపడానికి వారికి హక్కు ఉందా అని మీరు నన్ను అడిగితే? నా సమాధానం స్పష్టంగా అవును అన్నారు. అందుకే, కొంతమందికి అసౌకర్యం కలిగించినా సరే, ప్రజలు మళ్లీ ఈ ప్రశ్నలను అడగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇతర అంశాలను ప్రస్తావిస్తూ అసలు ప్రశ్నల నుంచి తప్పించుకునే బదులు, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే బాగుంటుందన్నారు.

వీటిలో నిరసన నిర్వహించేందుకు అనుమతి కోరుతూ సీజేపీ లేఖ సమర్పించిన తర్వాత, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన శాశ్వత ఆదేశాల ప్రకారం నిరసన స్థలంగా ఉన్న జంతర్ మంతర్‌ను నిరసనలకు అనుమతి లేని ప్రాంతంగా ఎలా మార్చారన్నారు.
అలాగే ఒక వ్యక్తిని నిరోధక నిర్బంధంలో ఉంచాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించే అధికారాన్ని ఏసీపీకి స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌గా ఇచ్చే వ్యవస్థను ఇంకా ఎంతకాలం కొనసాగిస్తామన్నారు. నిందితులుగా ఉన్న సీజేపీ సభ్యులపై ఢిల్లీ పోలీసులే ఫిర్యాదుదారులుగా ఉన్న కేసులో, అదే ఢిల్లీ పోలీసులకు చెందిన ఏసీపీ విచారణపై అధికారం చెలాయిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో నిర్ణయం ఏ వైపు మొగ్గు చూపుతుందో మీరే అర్థం చేసుకోవచ్చన్నారు.

అలాగే అక్టోబర్ 13న జంతర్ మంతర్ నుంచి అరెస్టయిన వారి బెయిల్ విచారణకు అక్టోబర్ 19న స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, అంటే ఢిల్లీ పోలీసుల ఏసీబీ, ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా ఎందుకు వచ్చారన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతూ విచారణ నుంచి ఎందుకు తప్పుకున్నారన్నారు. ఇదేమైనా హాస్యాస్పదమైన విషయమా అని అడిగారు. ఎనిమిది పూచీకత్తులను ఎందుకు తిరస్కరించారని అడిగారు. పూచీకత్తు సమర్పించేందుకు వచ్చిన వ్యక్తిని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎందుకు క్రాస్ ఎగ్జామినేషన్‌కు గురిచేశారన్నారు. నీట్ ఆందోళనల్లో నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు పెల్లెట్ గన్‌లను ఉపయోగించడం లేదా నిరసనకారులపై ప్రామాణిక కార్యాచరణ విధానాలను ఉల్లంఘించడం వంటి ఘటనలపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్, ఆప్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఏ బీజేపీ కార్యకర్త కూడా పూచీకత్తు నిబంధనలను ఉల్లంఘించలేదా? బారికేడ్లను దాటి వెళ్లినప్పుడు, ఆదేశాలను ధిక్కరించినప్పుడు కూడా ఇదే ఢిల్లీ పోలీసులు విధుల్లో ఉన్నారని నేను భావిస్తున్నట్లు తెలిపారు. మరి అప్పట్లో వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటిలాగేనా?
కచ్చితంగా కాదన్నారు.

దసరా వేడుకల్లో భాగంగా బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేసిన దృశ్యాన్ని చూశానని, జాతీయ స్థాయిలో ఈ ఉచిత ప్రచారాన్ని ఎవరు కల్పిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించానన్నారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదని, బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయల్ నేతృత్వంలోనే ఈ కార్యక్రమం జరిగిందన్నారు. బీజేపీ సీజేపీని వ్యతిరేకిస్తోందా? లేక దానికి ఉచిత ప్రచారం కల్పిస్తోందా? సీజేపీని మరింత పెద్ద రాజకీయ శక్తిగా చూపించి, ప్రతిపక్ష ఓట్లు చీలిపోయేలా చేయాలని చూస్తోందా? ఇలాగే కొనసాగితే, సీజేపకి ఇంతకంటే మెరుగైన ప్రచార బృందం ఉండేది కాదన్నారు. దాని కోసం డబ్బులు చెల్లించినా ఇంత మంచి ప్రచారం లభించేది కాదేమో అన్నారు. ఇదే తరహాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనను కూడా తాను ప్రశ్నించానన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఏం చేసిందని అడిగానని, ప్రజాస్వామ్య సంస్థల్లోని కొంతమంది వ్యక్తులు తప్పులు చేసి ఉండవచ్చని, అందుకు మొత్తం సంస్థలన్నింటినీ నిందిస్తూ వాటిపై నల్ల సిరా చల్లినట్లుగా ముద్ర వేయవద్దని ప్రతిపక్షాలకు, సీజేపీకి సూచించానన్నారు.

Annamalai Cites Modi s 2011 Remark to Defend CJP Protests Questions Delhi Police

చివరిగా ఈ దేశద్రోహులనే ముద్ర వేయడం ఇక చాలించాలన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటుందని, దేశంలోని అన్ని దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష పార్టీలకు నివేదించవన్నారు. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో, విదేశీ శత్రువులతో చేతులు కలిపి పనిచేసే భారతీయ పౌరులను గుర్తించేందుకు తగినంత మంది సిబ్బంది ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి నిరసనను, ప్రతి ప్రకటనను దేశవ్యతిరేక చర్యగా చిత్రీకరించడం, విదేశీ శక్తుల నిధులతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించడం చూడటానికి నిజంగా విసుగ్గా, బోరింగ్‌గా ఉందన్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ, తన ప్రాధాన్యతను నిలబెట్టుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక శత్రువును సృష్టించుకుంటూనే ఉందని నాకు అనిపిస్తోంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఇది నిజంగా విచారకరమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+