వియత్నాం వెళ్లిపోయిన రాహుల్? అలిసిపోయారు.. బ్రేక్ కావాలంటూ బీజేపీ సెటైర్
ఎలక్షన్ కమిషనర్ రాజీనామా కోరూతూ.. దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కిన వేళ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. పార్లమెంట్‌లోనూ, బయటా అధికార పార్టీపై ప్రతిపక్షాలు నిరసనల హోరు పెంచిన తరుణంలో.. ఆయన విమానంలో వియత్నాం వెళ్తున్నట్లుగా ఉన్న ఓ వీడియోను బీజేపీ తాజాగా బయటపెట్టింది. ఈ వీడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
"అలిసిపోయి విరామం తీసుకున్నారు".. కమలనాథుల ఎద్దేవా
రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొద్ది రోజులు రాజకీయంగా కష్టపడగానే ఆయనకు అలుపు వచ్చేస్తుందని, అందుకే తరచూ విహారయాత్రలకు చెక్కేస్తుంటారని మండిపడ్డారు. "అబద్ధాలు ప్రచారం చేసి అలసిపోయాను, కొద్దిసేపు వియత్నాం చుట్టొస్తాను" అంటూ బీజేపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఎద్దేవా చేస్తూ వీడియోను పోస్ట్ చేసింది. బీహార్‌లో యాత్ర ముగిశాక రెండు నెలలు విదేశాలకు వెళ్లినట్టే, ఇప్పుడు కూడా అలాగే వెళ్లారంటూ బీజేపీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ ధ్వజమెత్తారు. మరోవైపు, ఓట్ల తొలగింపు అంశం కేవలం సాకు మాత్రమేనని, రాహుల్ సోమరితనం వల్లనే ఇలా రెండు వారాలు కూడా గడవకముందే మళ్లీ టూరిజం మొదలుపెట్టారని షాజియా ఇల్మి తీవ్రస్థాయిలో విమర్శించారు.

”झूठ फैलाते-फैलाते थक गया... कुछ दिन वियतनाम घूम आता हूं... किसी को क्या ही पता चलेगा! 😜”
— BJP (@BJP4India) October 19, 2026
విదేశీ టూర్‌లపై గగ్గోలు ఎందుకు?.. కాంగ్రెస్ కౌంటర్
బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తిప్పికొట్టింది. ప్రతిపక్ష నేత ఎప్పుడు, ఎక్కడికి వెళ్తే బీజేపీకి వచ్చిన నష్టమేంటని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ నిలదీశారు. రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా, ప్రతిపక్ష నేతగా తన బాధ్యతల్లో భాగంగానే విదేశాలకు వెళ్తుంటారని స్పష్టం చేశారు. లండన్, యేల్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులతో మమేకం కావడం, మేధావులతో చర్చలు జరపడం ఆయన పనుల్లో భాగమని చెప్పారు. ప్రధానిలా కాకుండా రాహుల్ తరచూ ప్రెస్‌మీట్లు పెట్టి మీడియాతో మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. అంతేకాకుండా, లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న సమయంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఆనాడు ఈ సంప్రదాయ ఉల్లంఘనపై ఎందుకు ప్రశ్నలు రాలేదని దీక్షిత్ ఎదురుదాడికి దిగారు.
అసలు నేపథ్యం ఇదే..
ప్రస్తుతం దేశంలో ఎన్నికల సంఘం తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎస్ఐఆర్ అంశంపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాల పోరాటానికి ఆయన ముందుండి నాయకత్వం వహిస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఈసీ, బీజేపీ స్పష్టం చేస్తున్నప్పటికీ.. రాహుల్ మాత్రం ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ కీలక పోరాటం మ














Click it and Unblock the Notifications
