సహకార ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ వరుస షాక్ లు- ఈసారి మహారాష్ట్రలో..!

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోబోతున్న ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో ఈ మధ్య అధికార బీజేపీకి (BJP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు సహకార కర్మాగారాల ఎన్నికల్లో బీజేపీ ఓటములు చవిచూస్తుండగా.. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం మహారాష్ట్రలోనూ సహకార సంఘాల ఎన్నికల్లో ఆ పార్టీకి షాక్ తగిలింది. మహారాష్ట్రలో తాజాగా జరిగిన గోకుల్ సహకార పాల సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ నేత సతేజ్ పాటిల్ నాయకత్వంలోని 'రాజశ్రీ శాహు రైతు సమాచార వేదిక' చేతిలో బీజేపీ మద్దతున్న మహాయుతి ప్యానెల్ ఓటమిపాలైంది.

డీలిమిటేషన్ బిల్లుపై మరో అడుగు..! ఖర్గే డిమాండ్ పై స్పందించిన కేంద్రం..!
డీలిమిటేషన్ బిల్లుపై మరో అడుగు..! ఖర్గే డిమాండ్ పై స్పందించిన కేంద్రం..!

మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న గోకుల్ డెయిరీ ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠ మధ్య 'రాజర్షి షాహూ షేత్కారీ సమవిచారి అగాఢీ' విజయం సాధించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి సర్వశక్తులొడ్డినా కాంగ్రెస్ సీనియర్ నేత సతేజ్ పాటిల్ నేతృత్వంలోని ప్యానెల్.. ఈ డెయిరీపై తన ఆధిపత్యాన్ని విజయవంతంగా నిలబెట్టుకుంది. మొత్తం 25 డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో సతేజ్ పాటిల్ వర్గానికి చెందిన సమవిచారి అగాఢీ 13 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 25 సీట్లనూ గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన మహాయుతి ప్యానెల్ కేవలం 12 సీట్లకే పరిమితమైంది. దీంతో కొల్హాపూర్ జిల్లా రాజకీయాల్లో కీలకమైన గోకుల్ డెయిరీ పాలకవర్గం సతేజ్ పాటిల్ చేతుల్లోకి వెళ్లింది.

Setback for BJP-Backed Mahayuti Panel in Maharastra s Gokul Elections
టీమిండియా మాజీ క్రికెటర్ కు బీజేపీ సర్కార్ గిఫ్ట్..! వాషింగ్ మెషీన్ ఫార్ములా..!
టీమిండియా మాజీ క్రికెటర్ కు బీజేపీ సర్కార్ గిఫ్ట్..! వాషింగ్ మెషీన్ ఫార్ములా..!

లెక్కింపు ప్రక్రియ ముగిసే సమయంలో సమవిచారి అగాఢీ విజయం దాదాపు స్పష్టమైంది. అయితే మహాయుతి ప్యానెల్‌కు చెందిన కొందరు అభ్యర్థులు పునర్‌లెక్కింపునకు పట్టుబట్టడంతో లెక్కింపు కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రీకౌంటింగ్‌లో సమవిచారి అగాఢీకి చెందిన సచిన్ ఘోర్పడే ఓటమి పాలుకావడంతో సమవిచారి అగాఢీ కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఫలితాల్లో ఎలాంటి అక్రమాలు లేదా కుట్రలు జరగకుండా చూసేందుకు సతేజ్ పాటిల్, స్వాభిమాని షేత్కారీ సంఘటనా నాయకుడు రాజు శెట్టి వెంటనే లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు. ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే వరకు దాదాపు మూడు గంటల పాటు వారిద్దరూ లెక్కింపు కేంద్రం లోపలే ఉండి పరిస్థితిని నిరంతరం సమీక్షించారు. మహాయుతి నాయకులు తమ శక్తులన్నింటినీ ఉపయోగించినప్పటికీ, సతేజ్ పాటిల్ , రాజు శెట్టిల వ్యూహాల ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. లెక్కింపు కేంద్రం వద్ద గందరగోళం ముగిసి, విజయంపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే నాయకులు గులాబీ రంగులు చల్లుకుంటూ కార్యకర్తలతో కలిసి ఘనంగా విజయోత్సవాల్లో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+