CEC జ్ఞానేష్ ని తొలగించాలంటూ అసెంబ్లీ తీర్మానం..! ఏకగ్రీవ ఆమోదం-ఇదే తొలిసారి..!

ఎస్ఐఆర్ పేరుతో బీజేపీకి లబ్ది కలిగే విధంగా ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా లేదా కేంద్రం తొలగింపు కోసం ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలు ఇప్పుడు రాష్ట్రాల అసెంబ్లీల్ని సైతం తాకాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ కేరళ శాసనసభ (Kerala Assembly) ఇవాళ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. జ్ఢానేష్ ను తన పదవి నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇలా తీర్మానాన్ని ఆమోదించిన దేశంలోనే మొదటి రాష్ట్ర శాసనసభ ఇదే.

సుప్రీం అసాధారణ నిర్ణయం..! కోర్టు ధిక్కారంపై ఆదివారం విచారణ..!
సుప్రీం అసాధారణ నిర్ణయం..! కోర్టు ధిక్కారంపై ఆదివారం విచారణ..!

102 మంది సభ్యుల బలం ఉన్న అధికార కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి చెందిన 140 మంది సభ్యుల శాసనసభలో ముఖ్యమంత్రి వి.డి. సతీసన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 35 మంది సభ్యులున్న వామపక్షాలు కూడా ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వడంతో, ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సీఈసీని తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో పాటు, ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ సర్ లోని అక్రమాలను సరిదిద్ది ఓటు హక్కును పునరుద్ధరించాలని, అలాగే అన్యాయంగా తొలగించబడ్డారని ఆరోపణలు ఉన్న అర్హులైన ఓటర్లందరికీ వెంటనే ఓటు హక్కును కల్పించాలని ఈ తీర్మానం డిమాండ్ చేసింది.

Kerala Assembly Adopts Resolution Demanding Removal of CEC Gyanesh Kumar
Telangana SIR: 74 లక్షల మందికి గుడ్ న్యూస్- ఈసీ కీలక అప్డేట్..!
Telangana SIR: 74 లక్షల మందికి గుడ్ న్యూస్- ఈసీ కీలక అప్డేట్..!

సీఈసీ ఎంపిక విధానంలో మార్పు చేయాలని కూడా ఇది డిమాండ్ చేసింది. ఈసీ స్వతంత్రత, విశ్వసనీయతను కాపాడేందుకు, సీఈసీ ఎంపిక కమిటీలో ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని కోరింది. ఓటు హక్కు మన ప్రజాస్వామ్యానికి పునాది అని సీఎం సతీశన్ ఈ సందర్భంగా అన్నారు. పౌరుల రాజ్యాంగపరమైన హక్కులను దెబ్బతీసేలా ఏ సంస్థనూ అనుమతించకూడదని ఆయన పేర్కొన్నారు. తమ వైఖరి స్పష్టంగా ఉందని, ఓటు హక్కును రక్షించాలని ఆయన కోరారు. రాజ్యాంగాన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్యం నిలవాలి, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం కేరళ దృఢంగా నిలబడుతుందని ఆయన తెలిపారు. గతంలో కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండగా ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా ఇలాగే ఏకగ్రీవంగా అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+