మహిళా ప్రయాణీకురాలిపై ఎయిర్ఏషియా సిబ్బంది వేధింపులు
ఓ మహిళా ప్రయాణీకురాలిపై ఎయిర్‌ఏషియా ఎయిర్‌లైన్స్ సిబ్బంది వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.
బెంగుళూరు: ఓ మహిళా ప్రయాణీకురాలిపై ఎయిర్‌ఏషియా ఎయిర్‌లైన్స్ సిబ్బంది వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. పైలెట్‌సహా ఇద్దరు సిబ్బంది తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది.
నవంబర్ 3న ఆ యువతి రాంచీ నుంచి బెంగళూర్‌కు ఏయిర్ ఏషియా విమానంలో ఆ యువతి ప్రయాణించింది. విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో ఫోన్ స్విచ్ఛాఫ్ చేయమని సూచించటంతో యువతి ఫోన్‌ను స్విఛ్చాఫ్ చేసింది. అయినప్పటికీ పైలెట్‌తో సహా ఆ ఇద్దరు సిబ్బంది అనవరసంగా దూషించారని.. ఒకానోక సమయంలో విమానం నుంచి దించేస్తామని తనను బెదిరించారని ఆమె చెప్పింది.

ఇక విమానం సరిగ్గా ఉదయం 12గం.45ని. సమయంలో బెంగళూర్‌లో ల్యాండ్ కాగా.. ప్రయాణికులందరినీ పంపించి వేసి తనను మాత్రం అడ్డుకున్నారని యువతి తెలిపింది. తన తప్పేంటో చెప్పకుండా తనను ఎందుకు ఆపారని ప్రశ్నిస్తే.. పైలెట్‌కు క్షమాపణలు చెబితేనే వెళ్లనిస్తామని చెప్పి ఆ ఇద్దరు సిబ్బంది సమాధానమిచ్చారని బాధితురాలు చెప్పారు.
క్షమాపణలు చెప్పకపోతే ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారని చెప్పారు. తన స్నేహితురాలి సాయంతో ఆమె ఎయిర్‌ఏషియా సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications