48 గంటల్లోనే: మరో బీజేపీ సర్పంచ్‌పై ఉగ్రవాదుల కాల్పులు, మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు కాల్పులతో రెచ్చిపోతున్నారు. కాశ్మీర్‌లోని స్థానిక సర్పంచులే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా కుల్గాం జిల్లాలోని వెస్సూ ప్రాంతానికి చెందిన సర్పంచ్, బీజేపీ నేత సాజద్ అహ్మద్ ఖాండేపై ఆయన ఇంటి సమీపంలో కాల్పులు జరిపారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రగాయాలపాలైన సాజిద్‌ను వెంటనే అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ(జీఎంసీ) ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాజిద్ ప్రాణాలు వదిలాడు. కాగా, గడిచిన 48 గంటల్లోనే కుల్గాంలో ఇద్దరు సర్పంచులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం గమనార్హం.

ఆగస్టు 4న ఆరీఫ్ అహ్మద్ అనే సర్పంచ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అతను తీవ్రగాయాలయ్యాయి. కాగా, ఇతను కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన సర్పంచ్ కావడం గమానర్హం.
కాగా, గత కొంత కాలంగా బీజేపీ, కాంగ్రెస్ సర్పంచులు, నేతలే లక్ష్యంగా ఉగ్రవాదులకు కాల్పులకు తెగబడుతున్నారు. ఉగ్రవాదుల కాల్పులతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.
అనేక మంది ఉగ్రవాదులను ఇప్పటికే మట్టుబెట్టామని, కొందరు ప్రతీకారంగా ఈ విధమైన దాడులకు తెగబడుతున్నారని తాజాగా రాజీనామా చేసిన జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జీసీ ముర్ము వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను తుదముట్టించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications