మరోసారి మిజోరాంలో భూకంపం: 4.1గా తీవ్రతతో కంపించిన భూమి, మూడోసారి ప్రకంపనాలు..
మిజోరాంలో మరోసారి భూకంపం వచ్చింది. వరసగా మూడోరోజు భూ ప్రకంపనాలు వచ్చాయి. చంపాయికి నైరుతిలో 31 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించిందని భూగర్భ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఉదయం 8.02 గంటలకు చంపాయి, మిజోరాంలో 4.1 తీవ్రతతో భూకంపం రావడంతో.. జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పుడే కాదు సోమ, ఆదివారాల్లో ఇక్కడ భూమి కంపించింది.

Recommended Video
సోమవారం సాయంత్రం 4.10 గంటలకు చంపాయిలో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే భూ ప్రకంపనాలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ఆదివారం కూడా భూకంపం వచ్చింది. ఐజ్వాల్‌కు ఈశాన్యం దిశగా 25 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. సాయంత్రం 4.16 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూ కంప తీవ్రత రిక్టారు స్కేలుపై 5.1గా నమోదైంది. జూన్ 18న రాత్రి 7.29 గంటలకు మిజోరాంలోని చంపాయి ప్రాంతంలో భూకంపం సంభవించింది. అప్పుడు భూకంప తీవ్రత రిక్టారు స్కేలుపై 5.0గా నమోదైంది.












Click it and Unblock the Notifications