సుప్రీం మాజీ న్యాయమూర్తిపై మరో లైంగిక ఆరోపణ

నవంబర్ 11న ఫేస్‌బుక్‌లో జరిగిన చర్చలో ఆమె తన పేరుతోనే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి లైంగిక వేధింపుల ఉదంతాన్ని బయటపెట్టారు. కానీ తర్వాత ఆ వ్యాఖ్యలను తొలగించారని లీగల్లీ ఇండియా వెబ్‌సైట్ పేర్కొంది. వెబ్‌సైట్‌లో తనపై మూడూ వేర్వేరు సందర్బాల్లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె పేర్కొంది.
లైంగిక వేధింపులపై అప్పటి సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిని తాను నిలదీసినప్పుడు.. ముగ్గురు న్యాయమూర్తులతో ఒక బృందం ఏర్పాటు చేసి విచారణ జరపడంతో మరో మహిళతో ఈ విధంగా ప్రవర్తించబోనని ఆయన తనకు వాగ్ధానం చేశారనీ ఆమె చెప్పారు. అప్పుడు ఆయనను నమ్మామని తెలిపారు. అయితే ఇది యువతలో ఉన్న సానుకూల దృక్పథమని చెప్పారు. మొదటి బాధితురాలు ధైర్యం చేసి తనపై జరిగిన వేధింపులను బయటపెట్టారని మహిళా న్యాయవాది వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
మొదటి బాధితురాలు గత సంవత్సరం నవంబర్ 6న తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తన బ్లాగులో పేర్కొంది. ఢిల్లీ విశ్వవిద్యాలయం న్యాయవిభాగం మాజీ డీన్ ఫిర్యాదు మేరకు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తిపై ఢిల్లీ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. కాగా మాజీ న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలను తాము తేలికగా తీసుకోమని చెప్పిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం కేసును పరిశీలించేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications