మరో ఎంపీ రాజీనామాను ఆమోదించిన స్పీకర్..లోక్‌సభలో ఎంపీల సంఖ్య 533
అవిశ్వాస తీర్మానానికి కొన్ని గంటల ముందు లోక్‌సభలో ఎంపీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 533 పడిపోయింది. తాజాగా బీజేడీ ఎంపీ బైజయంత్ పండా రాజీనామాను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. మరోవైపు లోక్‌సభలో సభ్యుడిగా ఉన్న కేరళ కాంగ్రెస్ నేత జోస్ కే మణి రాజ్యసభకు నామినేట్ అవడంతో ఆయన రాజీనామాను కూడా స్పీకర్ ఆమోదించారు.
ఇదిలా ఉంటేమరో 10 సీట్లు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించాలంటే మ్యాజిక్ ఫిగర్ 266గా ఉంది. ఒడిషాలోని కేంద్రపార నియోజకవర్గం నుంచి పండా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన జూన్ 12న తన రాజీనామాను స్పీకర్‌కు సమర్పించగా ఆమె బుధవారం ఆమోదించింది. బిజూ జనతాదల్ పార్టీ నుంచి ఎన్నికైన పండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నందున పార్టీ అధిష్టానం ఆయనపై వేటు వేసింది.

శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. నాలుగేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డయేపై తొలిసారిగా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. గత 15 ఏళ్లలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ ఆమోదించడం కూడా ఇదే తొలిసారి. అయితే ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సంఖ్యాబలం ఉన్నందున ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!