కోల్ కతాలో మరో రేప్-ఈసారి బాయ్స్ హాస్టల్లోకి తీసుకెళ్లి యువతిపై ..!
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా ఇప్పుడు అత్యాచారాల రాజధానిగా మారిపోతోంది. గతంలో మెడికల్ కాలేజీలో, ఆ తర్వాత లా కాలేజీలో చోటు చేసుకున్న గ్యాంగ్ రేప్ ఘటనలతో నగరానికి చెడ్డ పేరు రాగా.. ఇప్పుడు ఓ మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ లో ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. ఈసారి బాయ్స్ హాస్టల్లోకి ఓ మహిళను రప్పించి రేప్ చేసిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై కోల్ కతా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కోల్ కతాలోని ఓ ప్రముఖ మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ లో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధి తన క్లాస్ మేట్ ను బాయ్స్ హాస్టల్ కు కౌన్సిలింగ్ సెషన్ పేరుతో రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పరమానంద్ తోపావున్వర్ అనే విద్యార్ధి తనను రేప్ చేశాడంటూ ఓ మహిళ కోల్ కతాలోని థాకూర్ పుకుర్ పోలీసుల్ని ఆశ్రయించింది. అక్కడి నుంచి వారు హరిదేవ్ పూర్ పోలీసు స్టేషన్ కు పంపారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు బెంగళూరు వాసి అని గుర్తించారు.

తనపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడు ముందే తెలుసని, ఆన్ లైన్ లో పరిచయం అయ్యి కోర్సుకు సంబంధించిన అంశాల్లో సహకారం అందిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. బాయ్స్ హాస్టల్ లోకి కౌన్సిలింగ్ పేరుతో తనను అతడు ఆహ్వానించాడని, అయితే విజిటర్స్ రిజిస్టర్ లో తన పేరు నమోదు చేయకుండా లోపలికి తీసుకెళ్లడంతో అనుమానం వచ్చిందని తెలిపింది. మధ్యలో వ్యక్తిగత పని ఉందని హాస్టల్ లోకి తీసుకెళ్లాడని, అక్కడ పిజ్జా, డ్రింక్ ఇచ్చాడని, మత్తుగా అనిపించి రెస్ట్ రూమ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా దగ్గరగా వచ్చాడని ఆరోపించింది.
అతన్ని తీవ్రంగా ప్రతిఘటించేందుకు ప్రయత్నించానని, చెంపదెబ్బ కొట్టానని, దీనికి ప్రతిగా ఎదురుదాడి చేశానని యువతి ఆరోపించింది. ఆ తర్వాత అతను తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. చివరికి తనకు మత్తు వదిలిన తర్వాత చూస్తే ఒంటరిగా ఉన్నానని, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని తన స్నేహితురాలి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు వెల్లడించింది.












Click it and Unblock the Notifications