బాంబులతో పరస్పరం దాడులు, ఇద్దరు మృతి

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ - భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బాంబులు, తుపాకులతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఆందోళన కారులు పోలీసు వాహనాలను తగులబెట్టారు.

బీర్భూమ్ జిల్లా మక్రాలో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మరణించగా.. ఒకరు గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు నెలకొనడంతో భారీగా బందోబస్తుని ఏర్పాటు చేశారు. అడిషనల్ సూపర్‌డెంట్ ఆఫ్ పోలీస్ ఆనంద రాయ్ స్పాట్‌లో ఉండి గ్రామంలో 144 సెక్షన్‌ను విధించినట్లు పోలీసులు వెల్లడించారు.

Another Trinamool-BJP Clash Breaks Out in Birbhum; 2 Killed

ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకూ ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని తెలిపారు. భాజపా - తృణమూల్ పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని పోలీసులు వెల్లడించారు.

ఢిల్లీలోని త్రిలోక్‌పురిలో మరో రెండు రోజులు 144 సెక్షన్‌

ఢిల్లీలోని త్రిలోక్ పురి ప్రాంతంలో గత ఐదు రోజులుగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. దీపావళి రోజున ఆ ప్రాంతంలోని ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తకు దారి తీసింది. దీంతో మరో రెండు రోజులు అక్కడ 144 సెక్షన్‌‌ కొనసాగుతుందని ఢిల్లీ పోలీసు కమీషనర్ బీఎస్ బసి తెలిపారు.

పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+