అధ్యాపకుల వేధింపులకు మరొకరు బలి.. మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య

Rajasthan: అధ్యాపకుల వేధింపులకు విద్యాకుసుమాలు రాలిపోతున్నాయి. ఇటీవల ఒడిశాలో అధ్యాపకుల వేధింపుల కారణంగా విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనను మరవక ముందే నోయిడాలోని శారద వర్సిటీలో డెంటల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలను మరువక ముందే రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక వైద్య విద్యార్థిని తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు అధ్యాపకుల మానసిక వేధింపులు, పరీక్షల నిర్వహణలో జాప్యం కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఫైనల్ ఇయర్ బీడీఎస్ విద్యార్థిని శ్వేత సింగ్ గురువారం రాత్రి తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. రూమ్‌మేట్ ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించి, వెంటనే హాస్టల్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో, కళాశాల అధ్యాపకులు తమను మానసికంగా వేధిస్తున్నారని, పరీక్షలను సకాలంలో నిర్వహించడం లేదని శ్వేత సింగ్ ఆరోపించినట్లు అధికారులు తెలిపారు.

Another Victim of Harassment Medical Student Dies by Suicide in Udaipur Teachers Accused

ఆందోళనకు దిగిన విద్యార్థులు
ఈ దురదృష్టకర సంఘటన తర్వాత కళాశాల విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు కళాశాల ఆవరణలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సూసైడ్ నోట్‌లో పేర్కొన్న అధ్యాపకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కళాశాల బయట రహదారిని దిగ్బంధించారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కళాశాల డైరెక్టర్ వారితో చర్చలు జరిపారు. ఈ ఘటనకు బాధ్యులైన అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన విద్యార్థులకు హామీ ఇచ్చారు. "ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి విచారణ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటారు. కళాశాల యాజమాన్యం కూడా ఈ పరిస్థితిని పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. సంబంధిత సిబ్బందిని తొలగిస్తుంది" అని డైరెక్టర్ మీడియాకు వెల్లడించారు.

సుఖేర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రవీంద్ర చరణ్ మాట్లాడుతూ.. విద్యార్థిని మృతదేహాన్ని మార్చురీకి తరలించామని, ఆమె కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని తెలిపారు. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన దేశంలోని విద్యాసంస్థలలో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, అధ్యాపకుల బాధ్యతలపై మరోసారి చర్చకు తెరలేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+