నుపుర్ శర్మ వ్యతిరేక నిరసనలపై కేంద్రం దృష్టి-రాష్ట్రాలకు హోంశాఖ కీలక ఆదేశాలు
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న శుక్రవారం ప్రార్ధనల తర్వాత దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో నిరసనలు చెలరేగాయి. యూపీ, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇవి కాస్తా హింసాత్మకంగా మారాయి. దీంతో కేంద్రం దీనిపై స్పందించింది.
శుక్రవారం ప్రార్థనల అనంతరం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు జాతీయ రహదారిని దిగ్బంధించడంతో కోల్‌కతా, హౌరా, సమీప ప్రాంతాలలో చాలా మంది ప్రయాణికులు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం ఇంటర్నెట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్‌లలో ఈ తరహా నిరసనలు చోటు చేసుకున్నాయి. జమ్మూలోని భదర్వాలో సెక్షన్ 144 కింద నలుగురి కంటే ఎక్కువ మంది వ్యక్తుల కదలికపై రెండు రోజుల పాటు ఆంక్షలు విధించారు.ఈ నిరసనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు అడ్వైజరీ పంపింది.

రాష్ట్రాల్లో పోలీసు బలగాలు నిరసనకారులకు లక్ష్యంగా మారే ప్రమాదం ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది అలాగే అల్లర్ల నుంచి కాపాడుకునేందుకు తగిన సామాగ్రి ధరించాలని వారిని కోరింది.ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న గుజరాత్ లో ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. ఇవాళ డయ్యూలో జరగనున్న గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలతో కూడిన పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications