కోహ్లీ తర్వాత..: పోకేమాన్ పిచ్చిలో పడిన అనుష్క!

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ప్రపంచాన్ని పిచ్చెక్కిస్తున్న పోకేమాన్ గో ఆట సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. భారత దేశంలోకి ఇంకా అధికారికంగా రాకపోయినప్పటికీ కొందరు దీనిని డౌన్ లోడ్ చేసుకొని ఆడుతున్నారు. ఈ పోకేమాన్ గోకు బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా ఫిదా అయిపోయింది.

బయటకు వెళ్లి పోకేమాన్‌లను వెతికి పట్టుకోవడంలో ఎంతో ఆనందం ఉందని, ఈ గేమ్ తనకు చాలా ఇష్టంగా ఉందని ఆమె చెబుతోంది. వేటాడేందుకు వెళ్లిన వారిలా.. పోకేమాన్‌లను పట్టుకోవడానికి వెళ్లడం అద్భుతంగా ఉందని చెబుతోంది.

#PokemonGo

A video posted by AnushkaSharma1588 (@anushkasharma) on Jul 26, 2016 at 11:20am PDT

ఇటీవలే ఆమె నటించిన సుల్తాన్ సినిమా అద్భుత విజయం సాధించింది. ఇప్పుడు అనుష్క పోకేమాన్‌లను పట్టుకునే పనిలో పడిందట.

స్వయంగా ఆమె ఓ వీడియోను అప్ లోడ్ చేసింది. అందులో అనుష్క శర్మ బ్లాక్ టాప్‌లో ఉంది. ఆమె తన ఫోన్లో పోకేమాన్‌లను పట్టుకునేందుకు ఆసక్తి చూపినట్లుగా ఉంది. కాగా, కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పోకేమాన్‌ల గురించి ట్వీట్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Just like many, Anushka Sharma has now joined the bandwagon and gotten hooked to Pokemon Go. The actress, who is riding high on the success of ‘Sultan’, went out on Pokemon hunting and now the actress wants to catch them all!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి