బాగా పని చేస్తున్నారు: బాబు, మళ్లీ విదేశాలకు మోడీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాగా పని చేస్తున్నారని, ఆయనను రాష్ట్రాలు అనుసరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఢిల్లీలో జరిగిన భారత ఆర్థిక శిఖరాగ్ర సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు. అభివృద్ధి దిశగా కేంద్రం, రాష్ట్రం వెళ్తున్నాయన్నారు. గనులు, పొడవైన సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్‌కు దోహదం చేస్తాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకోవాలన్నారు.

రెండు ప్రభుత్వ విధానాలతో దేశం ముందుకు వెళ్తోందని చెప్పారు. దేశంలో పారిశ్రామిక రంగానికి సానుకూల వాతావరణం ఉందన్నారు. ప్రజల అంచనాలు, సాధించిన పురోగతి దేశ అభివృద్ధికి కొలమానం అన్నారు. గత పదేళ్లలో దేశం వివిధ రంగాలలో వెనుకబడిందని చెప్పారు.

AP CM Chandrababu addresses World Economic Forum meet in Delhi

రానున్న రోజుల్లో యువతలో నైపుణ్యాలు పెంపొందిస్తామన్నారు. ముందు ముందు ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సమీకృత అభివృద్ధిలో సంస్కరణలు, సంక్షేమం ముఖ్యమన్నారు. ఐదు నెలలుగా ఏపీ ఈ విధానాన్ని అవలంభిస్తోందన్నారు. ఏపీని దేశానికి పారిశ్రామిక ముఖద్వారంగా మార్చుతామన్నారు.

నవంబర్ 11 నుండి మోడీ విదేశీ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 11వ తేదీ నుండి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిద సదస్సుల్లో, ద్వైపాక్షిక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. తన విదేశ పర్యటనతో ఆసియా దేశాలతో సంబంధాలు బలపడతాయని చెప్పారు.

మయన్మార్ నేతలతో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తామని మోడీ చెప్పారు. మయన్మార్ భారత దేశానికి మిత్ర దేశామన్నారు. ఇది ఓ విలువైన మిత్ర దేశమన్నారు. ఆసియా దేశాలతో సంబంధాలు మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. 20వ తేదీన జరిగే జీ 20 దేశాల సదస్సులో పాల్గొంటానని చెప్పారు. సదస్సు వేదికగా భారత్ అవకాశాలను ప్రపంచానికి వివరిస్తానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+